నీళ్లగంట మోగెనంట 

17 Nov, 2019 02:49 IST|Sakshi

భాగ్యనగరంలోనూ శనివారం కొన్ని ప్రభుత్వ పాఠశాలల్లో నీళ్లగంట మోగింది.స్కూలు విద్యార్థులు సకాలంలో నీరు తాగక పోవడం వల్ల తలెత్తుతున్న ఆరోగ్య సమస్యలను గుర్తించిన కేరళ రాష్ట్రంలోని ఓ పాఠశాలలో ఉపాధ్యాయులు ‘నీళ్ల గంట’మోగించి వారిని చైతన్యపరిచారు. సత్ఫలితాలిస్తున్న ఈ వార్తలకు సామాజిక మాధ్యమాల్లో ప్రచారం లభించడంతో ఇతర రాష్ట్రాల వారూ దాన్ని అందిపుచ్చుకుంటున్నారు. ఇదే స్ఫూర్తితో హైదరాబాద్‌ డీఈవో వెంకటనర్సమ్మ ‘నీళ్ల గంట’విధానాన్ని నగరంలోని పాఠశాలల్లో అమలు చేసేందుకు నడుంకట్టారు. ఈ మేరకు తన వాట్సాప్‌ ఆదేశాలతో కొన్ని పాఠశాలల్లో దీన్ని శనివారం ప్రయోగాత్మకంగా అమలు చేయించారు. ఇలా బంజారాహిల్స్‌ రోడ్‌ నం.11లోని ఉదయ్‌నగర్‌ ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలలోని పిల్లలు నీరు తాగేందుకని స్కూల్‌ సమయంలో మూడుసార్లు ‘వాటర్‌ బెల్‌’మోగించారు. పిల్లలంతా హుషారుగా ఆ సమయంలో తాము తెచ్చుకున్న నీటిని తాగారు. ఆరోగ్య సూత్రాన్ని పాటించారు. 

మరిన్ని వార్తలు