నీళ్ల కోసం మహిళల రాస్తారోకో

30 Jul, 2018 12:54 IST|Sakshi
రాస్తారోకో చేస్తున్న భగత్‌సింగ్‌ కాలనీవాసులు

రెబ్బెన (కుమురం భీం): గత వారం రోజులుగా గోలేటి పరిధిలోని భగత్‌సింగ్‌ నగర్‌ కాలనీలకు నీటి సరాఫరా నిలిచిపోవటంతో ఆగ్రహించిన మహిళలు ఖాళీ బిందెలతో రోడ్డెక్కి రాస్తారోకో చేపట్టారు. సింగరేణి రోడ్డుపై ఖాళీ బిందెలతో బైఠాయించి వా హనాల రాకపోకలను అడ్డుకున్నారు. ఈసంద ర్భంగా వారు మాట్లాడుతూ గత వారం రోజు లుగా కాలనీలకు తాగునీటి సరాఫరా పూర్తిగా నిలిచిపోయిందన్నారు. పిల్లలను పాఠశాలలకు పంపించాలన్నా స్నానాలు చేసేందుకు బిందెడు నీళ్లు లేకుండా పోయాయన్నారు. దూరంగా ఉన్న చేతిపంపుల నుంచి తాగేందుకు బిందెడు నీళ్లు తెచ్చుకుంటున్న రోజు వారి అవసరాలకు నీళ్లు దొ రకటం లేదన్నారు. పంచాయతీ సిబ్బంది సమ్మె పేరుతో కాలనీలకు నీటి సరాఫరా పూర్తిగా నిలిచిపోయిన అధికారులెవరు పట్టించుకోవటం లేద న్నారు.

వారం రోజులుగా ప్రజలందరూ నీళ్ల కో సం అవస్థలు పడుతుంటే అధికారులు చోద్యం చూస్తున్నారని విమర్శించారు. పంచాయతీ సి బ్బంది సమ్మె చేపడితే ప్రత్యామ్నాయ చర్యలు చేపట్టి ప్రజలకు ఇబ్బందులు తలెత్తకుండా చర్య లు చేపట్టడంలో అధికారులు పూర్తిగా విఫలం అ య్యారని అన్నారు. సుమారు ఆరగంటకు పైగా వాహనాలను అడ్డుకోవటంతో రోడ్డుకు ఇరువైపుల భారీగా వాహనాలు నిలిచిపోయాయి. దీం తో సమాచారం అందుకున్న సీఐ రమణమూర్తి సంఘటన స్థలానికి చేరుకుని మహిళలతో మాట్లాడారు. సమస్య పరిష్కారం కోసం రాస్తారోకో చే యటం సరికాదని పోలీస్‌ యాక్ట్‌ అమలులో ఉ న్నందుకు ధర్నాలు, రాస్తారోకోలు చేయటం సరికాదన్నారు. సమస్యను సంబంధిత అధికారుల దృష్టికి తీసుకువెళ్లి పరిష్కారం అయ్యేలా చూ స్తామని హామీ ఇవ్వటంతో కాలనీ వాసులు ఆందోళన విరమించారు.

Read latest Telangana News and Telugu News
Follow us on FaceBook, Twitter
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు

నాపై దాడి చేసింది ఆయనే : జబర్దస్త్‌ వినోద్‌

ఎగిరే పార్టీకాదు.. నిలదొక్కుకునే పార్టీ..

‘మేఘా’ పై జీఎస్టీ దాడులు అవాస్తవం

అతి పెద్ద డబుల్‌ బెడ్‌రూం ఇళ్ల కాలనీ

కరీంనగర్‌ మున్సిపల్‌ ఎన్నికకు బ్రేక్‌

సెల్‌ఫోన్‌ కొనివ్వలేదని..

‘హరిత’ సైనికుడు

‘జబర్దస్త్‌’ ఆర్టిస్ట్‌ వినోదినిపై దాడి.. గాయాలు

లైట్‌ జాబా.. అయితే ఓకే

‘కేఎంసీ తెలంగాణకే తలమానికం’

‘దేశంలో రూ. 2016 పెన్షన్‌ ఇస్తున్నది కేసీఆర్‌ మాత్రమే’

ఈ కాలేజ్‌లకు లెక్చరర్లే లేరు!

దౌల్తాబాద్‌లో భార్యపై హత్యాయత్నం

ఎమ్మెల్యేకు ఫిర్యాదు చేసిన వారు కూడా నేరస్తులే 

హైదారాబాద్‌ బస్సు సర్వీసులపై అభ్యంతరం

దోపిడీ దొంగల హల్‌చల్‌! 

లక్కోరలో మహిళ దారుణ హత్య 

పురుగులమందు పిచికారీకి ఆధునిక యంత్రం

రాష్ట్రంలో కాంగ్రెస్‌ కనుమరుగు

‘బీ–ట్రాక్‌’@ గ్రేటర్‌

సీతాకోక చిలుకా.. ఎక్కడ నీ జాడ?

ఫ్లోరైడ్‌ బాధితుడి ఇంటి నిర్మాణానికి కలెక్టర్‌ హామీ

మరింత ఆసరా!

పైసా వసూల్‌

పురుగుల అన్నం తినమంటున్నారు..!

‘హరీష్‌ శిక్ష అనుభవిస్తున్నాడు’

ఆస్పత్రి గేట్లు బంద్‌.. రోడ్డుపైనే ప్రసవం..!

కిడ్నాప్‌ ముఠా అరెస్టు

సారొస్తున్నారు..

డబ్బుల కోసమే హత్య.. పట్టించిన ఫోన్‌ కాల్‌

ఆంధ్రప్రదేశ్
తెలంగాణ
సినిమా

‘ఆమె ఆరోపణలతో తలెత్తుకోలేక పోతున్నాం’

‘మా కొడుకు మమ్మల్ని కలిపి ఉంచుతున్నాడు’

అడవి శేష్‌ ‘ఎవరు’ రీమేకా?

రూల్స్‌ బ్రేక్‌ చేసిన వర్మ.. ఫైన్‌ వేసిన పోలీసులు!

ఉత్తర ట్రైలర్‌ లాంచ్‌

బైక్‌ మీద సినిమాకెళ్తున్నా : ఆర్జీవీ