మసక మసక

10 Feb, 2020 04:10 IST|Sakshi

హైదరాబాద్‌లో పడిపోయిన పగటి ఉష్ణోగ్రతలు

సాక్షి, హైదరాబాద్‌: రాష్ట్రంలో ఆదివారం పలు చోట్ల వర్షాలు కురిశాయి. సూర్యాపేట జిల్లా మోతె మండలం ఉర్లుగొండలో 9 సెంటీమీటర్ల భారీ వర్షం కురిసింది. నల్లగొండ జిల్లా మిర్యాలగూడలో 6 సెం.మీ., మహబూబాబాద్‌ జిల్లా మరిపెడ, ఖమ్మం జిల్లా తిరుమలాయపాలెం మండలం బచ్చోడు, నల్లగొండ జిల్లాలో 4 సెం.మీ. చొప్పున వర్షపాతం నమోదైంది.  హన్మకొండలో సాధారణం కంటే 8.6 డిగ్రీలు తక్కువగా 24 డిగ్రీల గరిష్ట ఉష్ణోగ్రత నమోదైంది.

హైదరాబాద్‌లో చిరు జల్లులు.. 
ఉపరితల ఆవర్తనం ఫలితంగా ఆదివారం హైదరాబాద్‌లో పలు చోట్ల శీతలగాలులతోపాటు చిరు జల్లులు కురిశాయి. ఆదివారం నగరంలో సాధారణం కంటే 8.2 డిగ్రీలు తక్కువగా 23 డిగ్రీల సెల్సియస్‌ పగటి ఉష్ణోగ్రత నమోదైంది. నగరంలో అత్యధికంగా రాజేంద్రనగర్‌లో 27 మి.మీ, ఉప్పల్‌లో 26, అల్వాల్‌లో 19.8, సికింద్రాబాద్‌లో 16 మి.మీ వర్షపాతం నమోదైంది. సోమవారం అక్కడక్కడా తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశముంది. 

Read latest Telangana News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు