నెర్రెలు బారిన పొలాలు

6 Oct, 2014 02:00 IST|Sakshi

ఖానాపూర్ : మండలంలో సుమారు 1000 ఎకరాల్లో రైతులు వరి పంట సాగు చేశారు. బాధన్‌కుర్తి, బీర్నం ది, పాత ఎల్లాపూర్, మందపల్లి, దిలావర్‌పూర్  తదితర గ్రామాల్లో వర్షాధార ంపై ఆధారపడి సాగు చేసిన పంటలు ఇప్పటికే ఎండిపోగా, వ్యవసాయ బావుల కింద సాగు చేసిన కొద్ది పాటి పంటలు కూడా విద్యుత్ కోతలతో నీరందక ఎండిపోతున్నాయి.

దీనికి తోడు లోవోల్టేజీ సమస్యతో తరచూ మోటార్లు కాలిపోవడంతో ఆర్థిక భారం పడుతోంది. వేళాపాల లేని కరెంటు కోతలతో   రైతులకు కంటిమీద కునుకు లేకుండా  రాత్రిళ్లు జాగారం చేస్తున్నారు. జిల్లాలో ఇటీవల అధికారులు ఏడుగంటలకు బదులు నాలుగు గంటలకు కుదించినా, కనీసం రెండుగంటలైనా సరఫరా ఇవ్వడం లేదంటూ రైతులు ఆందోళన బాటపట్టారు. కార్యాలయాలు ముట్టడించి, పర్నీచర్ ధ్వంసం చేయడంతోపాటు సిబ్బందిని నిర్బంధిస్తున్నారు. ఎన్నడూ లేని విధంగా ఇటీవల అర్ధరాత్రి సైతం రైతులు కార్యాలయాల వద్ద ఆందోళన చేయాల్సిన పరిస్థితులు తలెత్తాయి.  

 సాగు భారమైనా..
 సాగు భారమైనా రైతులు ఆయిలింజిన్లు, జనరేటర్లతో పంటలు వేయాల్సిన దుస్థితి నెలకొంది. వేసిన పంట చేతికస్తుందో లేదోననే ఆందోళన రైతుల్లో తీవ్రమైంది. కళ్లముందే పంటలు ఎండిపోతుంటే చూడలేక సాగు నీటిని పంటకు అందించేందుకు రైతులు అదనపు భారమైన కొత్త జనరేటర్లు కొనుగోలు చేస్తు న్నారు. చి‘వరికి’ పంట చేతికందేవరకు దే వుడిపైనే భారం వేసి ఆదాయానికి మించి పెట్టుబడి పెడుతున్నారు.

  ప్రత్యామ్నాయ మార్గాలపై దృష్టి
 ఎడాపెడా విద్యుత్ కోతలను భరించలేక పలువురు రైతులు రూ. 20 వేలకుపైగా వెచ్చించి ఆయిలింజిన్లు, జనరేటర్ కొనుగోలు చేసి పంటలకు నీరందిస్తున్నారు. మరికొందరు అద్దెకు తెచ్చి పంటలను కాపాడుకుంటున్నారు. ఇప్పటికే ఎకరాకు రూ.20 వేల వరకు పెట్టుబడి పెట్టిన రైతు ఆయిలింజిన్, జనరేటర్ కొని అదనపు భారం మోస్తున్నాడు. ఒక గంట ఆయిలింజన్ నడవాలంటే  లీటర్ డీజిల్ కొనుగోలు చేయాల్సి వస్తోందని రైతులు ఆందోళన చెందుతున్నారు.

మరిన్ని వార్తలు