ఇంకా మంటలు అదుపులోకి రాలేదు : డీఎస్‌పీ

24 Apr, 2018 09:58 IST|Sakshi

సాక్షి, హైదరాబాద్‌: పటాన్‌చెరు పారిశ్రామికవాడలో మంగళవారం ఉదయం భారీ అగ్ని ప్రమాదం చోటుచేసుకుంది. స్థానిక అగర్వాల్‌ రబ్బరు పరిశ్రమలో సంభవించిన ప్రమాదం కారణంగా పెద్ద ఎత్తున మంటలు ఎగసిపడుతున్నాయి. మంటలు ఆర్పడానికి 6 అగ్నిమాపక యంత్రాల సాయంతో ఫైర్‌ సిబ్బంది విశ్వ ప్రయత్నాలు చేస్తున్నా.. ఈదురు గాలులు తోడవడంతో సిబ్బంది వాటిని అదుపు చేయలేక పోతున్నారు. 

దీనిపై డీఎస్‌పీ సీతారాం మాట్లాడుతూ.. ఈ రోజు తెల్లవారుజామున 2.45 గంటలను అగ్ని ప్రమాదంకు సంబంధించి ఫోన్‌ కాల్‌ వచ్చింది. సమాచారం అందిన వెంటనే ఫైరింజన్లను రంగంలోకి దింపి మంటలను ఆర్పే ప్రయత్నం చేస్తున్నాము. అయినా ఇప్పటికీ మం‍టలు అదుపులోకి రావడం లేదని, మరో మూడు గంటలకు పైగా సమయం పట్టే అవకాశం ఉన్నట్లు తెలిపారు. అదృష్టవశాత్తు ఎలాంటి ప్రాణహని జరగలేదన్నారు. ఈ ప్రమాదం శాట్‌ సర్క్యూట్‌ ద్వారా జరిగిందా లేక మరేదైనా కారణమా అన్న విషయంపై ఇంకా స్పష్టతలేదన్నారు. మంటలు అదుపులోకి వచ్చాక ప్రమాదం ఎలా జరిగిందన్న దానిపై దర్యాప్తు చేస్తామని చెప్పారు. 

Read latest Telangana News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు
సినిమా