రాంగోపాల్‌వర్మపై డీఎస్పీకి ఫిర్యాదు

2 Sep, 2014 02:35 IST|Sakshi

రామచంద్రాపురం : సినీ దర్శకుడు రాంగోపాల్‌వర్మ హిందువులను అగౌర పరిచేలా ట్విట్టర్‌లో  వ్యాఖ్యలు చేశారని ఆయనపై చట్టరీత్యా చర్యలు తీసుకోవాలని కోరుతూ భజరంగ్‌దళ్ నాయకులు డీఎస్పీ కవితకు సోమవారం ఫిర్యాదు చేశారు. అనంతరం భజరంగ్‌దళ్ రాష్ట్ర కో కన్వీనర్ ఎం సుభాష్ చందర్, జిల్లా గోరక్ష ప్రముఖ్ మాణిక్యం, వీహెచ్‌పీ జిల్లా ఉపాధ్యక్షుడు శ్రీధర్‌గౌడ్ మాట్లాడారు. ఓ మతాన్ని కించపరుస్తూ ట్విట్ చేసిన రాంగోపాల్‌వర్మపై ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఫిర్యాదు చేసిన వారిలో నాయకులు మనికంఠ, విజయ్ తదితరులు ఉన్నారు.

మరిన్ని వార్తలు