దుమ్ముగూడెంపై నీలినీడలు..!

21 Apr, 2015 00:13 IST|Sakshi
దుమ్ముగూడెం ప్రాజెక్టు నిర్మించాలని గుర్తించిన గోదావరి ప్రదేశం

కొత్త ప్రాజెక్టుతో జిల్లా భూములకు నీరివ్వాలని యోచన
నల్లగొండ జిల్లాలో కొంత ఆయకట్టును చేర్చాలని నిర్ణయం..?
ప్రాథమికంగా డిజైన్ చేస్తున్న అధికార యంత్రాంగం
అధికారికంగా ప్రకటించని ప్రభుత్వం


సాక్షి, ఖమ్మం: ఖమ్మం జిల్లాకే పరిమితం చేయూలనుకున్న దుమ్ముగూడెం ప్రాజెక్టుపై నీలినీడలు అలముకున్నాయి. ఇటీవల సీఎం కేసీఆర్ జిల్లా పర్యటనలో భాగంగా మణుగూరులో దుమ్ముగూడెం-నాగార్జునసాగర్ టెయిల్‌పాండ్‌ను రద్దు చేసి.. దుమ్ముగూడెం ప్రాజెక్టు ను జిల్లాకే పరిమితం చేశామని ప్రకటించారు. అయితే జిల్లాలో ఈ ప్రకటన చేసి నెలరోజుల కావస్తున్నా.. ప్రభుత్వం ఇప్పటి వరకు ఈ ప్రాజెక్టుపై అధికారిక నిర్ణయం తీసుకోలేదు.

టెయిల్‌పాండ్ పనులు రద్దు చేసిన విషయమై కాంట్రాక్టర్లు కోర్టుకు వెళ్లే యోచనలో ఉండటంతో ప్రభుత్వం ఈ ప్రాజెక్టును ఏం చేయాలనే అంశంపై తర్జనభర్జన పడుతోంది. మరోవైపు సంబంధిత యంత్రాంగం దుమ్ముగూడెం ప్రాజెక్టు జిల్లా ఆయకట్టుతో పాటు నల్లగొండ జిల్లాలో కొంత ఆయకట్టును చేర్చేందు కు డిజైన్ చే స్తోంది.

జిల్లాలోని బీడు భూములను సస్యశ్యామలం చేసేందుకు జలయజ్ఞలంలో ఇందిరాసాగర్, రాజీవ్‌సాగర్(దుమ్ముగూడెం)లతో పాటు దుమ్ముగూడెం-నాగార్జుసాగర్ టెయిల్‌పాండ్‌లను ఉమ్మడి రాష్ట్ర ప్రభుత్వం చేపట్టింది.  గతంలో కిరణ్ ప్రభుత్వం, ప్రస్తుతం టీఆర్‌ఎస్ ప్రభుత్వ బడ్జెట్‌లోనూ ఈ ప్రాజెక్టుకు నిధుల కేటాయింపు లేదు. అంతేకాకుండా సీఎం కేసీఆర్ జిల్లా పర్యటనలో టెయిల్‌పాండ్‌ను రద్దు చేస్తున్నట్లు ప్రకటించారు. దీని స్థానంలో ‘దుమ్ముగూడెం’ పేరుతో జిల్లాలోని బీడు భూములను సస్యశ్యామలం చేయాలని ప్రభుత్వం భావిస్తుందన్నారు.

నిధులు కేటాయించేనా..?
కొత్తగా తైరపైకి తెస్తున్న ఈ ప్రాజెక్టుకు నిధుల కేటాయింపు ఎలా ఉంటుందన్నది ప్రశ్నార్థక మే. ‘తాను జిల్లాలో ఆరురోజుల్లోగా పర్యటన కు వస్తానని.. ఈ లోపు జిల్లా సంబంధించిన స మస్యలన్నింటిపై చర్చిస్తాను’అని సీఎం కేసీఆర్ మణుగూరులో ప్రకటించారు. సీఎం మళ్లీ పర్యటనకు జిల్లాకు వచ్చేలోపు పూర్తి స్థాయి నివేదిక తయారు చేసే పనిలో నిమగ్నమయ్యా రు. కాగా, సీఎం మలి పర్యటనలో ఈ ప్రాజెక్టు పై ఏం ప్రకటన చేస్తారో.. ఎన్ని నిధులు కే టాయిస్తారోనని ఆశగా ఎదురు చూస్తున్నారు.

టెయిల్‌పాండ్ స్వరూపం ఇదీ..
గోదావరి, కృష్ణా నదులను అనుసంధానం చేసుందుకు జ్యోతిరావు ఫూలే దుమ్ముగూడెం- నాగార్జునసాగర్ సుజల స్రవంతి (లింక్ కెనాల్) ప్రాజెక్టును నిర్దేశించారు. ఈ ప్రాజెక్టు  ద్వారా గోదావరి నది నుంచి 165 టీఎంసీల వరద నీటిని కృష్ణానదిపై ఉన్న నాగార్జునసాగర్ టెయిల్‌పాండ్ ప్రాజెక్టుకు పంపి జిల్లాలో సాగర్ ఆయకట్టును స్థీరీకరించాలన్నది అప్పటి ప్రభుత్వ లక్ష్యం.

జిల్లాతో పాటు ఉమ్మడి రాష్ర్టంలోని కృష్ణా, నల్లగొండ, గుంటూరు, ప్రకాశం జిల్లాల్లోని 22.13 లక్షల ఎకరాలకు సాగు నీరు అందించాలని ఈ ప్రాజెక్టును డిజైన్ చేశారు. మణుగూరు మండలం అనంతారం గ్రామం వద్ద గోదావరి నదిపై దీన్ని నిర్మించాలని భావించారు. జిల్లాలో ప్రధానంగా 2.64 లక్షల ఎకరాలకు ఈ ప్రాజెక్టు ద్వారా సాగునీరు అందించాలని భావించారు. ఈ ప్రాజెక్టును రూ. 19,521.42 కోట్ల వ్యయం అంచనా వేశారు. 2013 -2014 నాటికి పూర్తి కావాల్సిన ఈ పనులకు ఇప్పటి సుమారు రూ.713 కోట్లు విడుదల చేశారు.

రాష్ర్ట విభజనతో..
జలయజ్ఞంలో ఈ ప్రాజెక్టుకును చేపట్టినా రాష్ట్ర విభజన నేపథ్యంలో జిల్లాకే ఈ ప్రాజెక్టును పరిమితం చేయాలని ప్రభుత్వం సంకల్పించింది. ఇప్పుడున్న రాజీవ్, ఇందిరాసాగర్ ప్రాజెక్టులకు తోడు దీన్ని ద్వారా జిల్లాలో 2.64 లక్షల ఆయకట్టుకు నీరందించాలన్న యోచనలో ప్రభుత్వం ఉన్నట్లు సమాచారం. అప్పట్లో తెలంగాణలోని నల్లగొండ జిల్లా కూ డా ఈ ప్రాజెక్టులో ఉంది.

అయితే ప్రస్తుతం జిల్లా వరకే ఈ ప్రాజెక్టును పరిమితం చేస్తుండడంతో సుమారు 3 లక్షల ఎకరాలకు రెండు లేదా మూడు పంపులు ఏర్పాటు చేసి నీటిని ఎత్తిపోసే అవకాశం ఉంది.  దీంతో పాటు ఎస్సారెస్పీ పరిధిలో పాలేరు నియోజకవర్గం లో ఉన్న భూములకు కూడా దుమ్ముగూడెం ప్రాజెక్టు ఆయకట్టు కిందకు తెచ్చే యోచనలో ప్రభుత్వం ఉంది. గతంలో టెయిల్‌పాండ్‌లో నల్లగొండ జిల్లా కూడా ఉండడంతో అప్పటి ఆయకట్టును ప్రస్తుతం ఈ ప్రాజెక్టు పరిధిలోకి తెచ్చేందుకు మరో డిజైన్ చేస్తున్నారు.

మరిన్ని వార్తలు