‘కేబుల్‌ వంతెన’.. పర్యాటక ఆకర్షణ!

21 Jun, 2020 04:25 IST|Sakshi

జూలై చివరికి దుర్గంచెరువు కేబుల్‌ బ్రిడ్జి రెడీ!

శని, ఆదివారాల్లో వాహనాలకు ‘నో ఎంట్రీ’

పర్యాటకులకు కాలినడకన సందర్శనకు అనుమతి

సాక్షి, సిటీబ్యూరో: హైదరాబాద్‌ అనగానే ఠక్కున గుర్తొచ్చేవి.. చార్మినార్, గోల్కొండ, సాలార్జంగ్‌ మ్యూజియం. వీటితో పాటు సైబర్‌ టవర్స్, హైటెక్‌సిటీ, ఐకియా వంటివి కూడా.. ఇక తాజాగా ఈ వరుసలో చేరనున్నది దుర్గం చెరువు కేబుల్‌ బ్రిడ్జి. ప్రారంభానికి ముందే ఎంతగానో ప్రచారమైన దుర్గం చెరువు కేబుల్‌ వంతెన.. ప్రారంభానంతరం పర్యాటక ప్రాంతంగానూ మారనుంది. అందుకనుగుణంగా ఏర్పాట్లు జరుగుతున్నాయి. మంత్రి కేటీఆర్‌ దీనిపై ప్రత్యేక శ్రద్ధవహిస్తూ పనుల్ని పర్యవేక్షిస్తున్నారు. ఈ వంతెన.. శని, ఆదివారాల్లో పర్యాటక ప్రాంతంగా మారనుంది. ఈ రెండ్రోజుల్లో వంతెన పైకి వాహనాలకు అనుమతి లేదని జీహెచ్‌ఎంసీ తెలిపింది.

వచ్చే నెలాఖరులో ప్రారంభం.. 
బ్రిడ్జి నిర్మాణానికి రూ.184 కోట్లు ఖర్చు కాగా, ప్రస్తుతం ప్రత్యేక లైటింగ్‌ ఏర్పాట్లు జరుగుతున్నాయి. జూలై నెలాఖరుకు ప్రారంభించాలని మంత్రి కేటీఆర్‌ ముహూర్తం నిర్ణయించారు. ఇది ప్రారంభమయ్యాక ఆ సొగసులకు పర్యాటకులు మంత్రముగ్ధులు కావడం ఖాయమని అంటున్నారు. వారాంతాల్లో కేవలం పర్యాటకులను కాలినడకన మాత్రమే బ్రిడ్జిపైకి అనుమతి స్తారని జీహెచ్‌ఎంసీ ప్రాజెక్ట్స్‌ విభాగం చీఫ్‌ ఇంజినీర్‌ ఆర్‌.శ్రీధర్‌ ఒక ప్రకటనలో తెలిపారు. పర్యాటకులు ప్రకృతిని, ప్రశాంతతను ఆస్వాదించాలనే కేటీఆర్‌ ఆదేశాలకనుగుణంగా ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. వాహ నాల పార్కింగ్‌కు ప్రత్యేక ఏర్పాట్లు చేయనున్నారు. ఇక, ప్రత్యేక తరహా లైటింగ్‌ సిస్టంతో కేబుల్‌ బ్రిడ్జి రాత్రిళ్లు వెలుగులు విరజిమ్మనుంది. వివిధ బొమ్మలు వెలుతుర్లో కనువిందు చేయనున్నాయి. దుర్గంచెరువులోని నీళ్లూ మిలమిలా మెరవనున్నాయి. ఈ బ్రిడ్జి ప్రారంభంలోగా జూబ్లీహిల్స్‌ రోడ్‌నంబర్‌ 45 ఎలివేటెడ్‌ కారిడార్‌ పనుల పూర్తికీ జీహెచ్‌ఎంసీ శ్రమిస్తోంది.   
► ఐటీ శాఖ నిర్వహిస్తున్న ఈ–ప్రొక్యూర్మెంట్‌ విభాగం ద్వారా సుమారు రూ.1,20,434 అంచనా వ్యయం కలిగిన 1,55,182 టెండర్లను నిర్వహించారు. ఈ గణాంకాలతో టెండర్ల నిర్వహణలో దేశంలోనే రెండో స్థానంలో నిలిచింది.  
► టెక్నాలజీ ఎంపవరింగ్‌ గరŠల్స్‌ పేరుతో 560 మంది స్త్రీలకు డిజిటల్‌ లిటరసీ నైపుణ్యాన్ని అందించింది. 
► కరోనా రోగుల కోసం తక్కువ ఖర్చుతో కూడిన వెంటిలేటర్‌ను టీ–వర్క్స్‌ తయారుచేసింది. 
► తెలంగాణ డిజిటల్‌ మీడియా విభాగం తెలుగు వికీపీడియా రూపకల్పనకు ట్రిపుల్‌ ఐటీ హైదరాబాద్‌తో కలిసి పనిచేస్తోంది. తెలుగు వికీపీడియాలో ప్రస్తుతం ఉన్న లక్ష వ్యాసాలను 30 లక్షలకు పెంచాలనే లక్ష్యంతో పనిచేస్తున్నారు 
► తెలంగాణ స్టేట్‌ ఇన్నోవేషన్‌ సెల్‌ తరఫున తెలంగాణ ఇన్నోవేషన్‌ యాత్ర నిర్వహించి 120 మంది ఔత్సాహిక ఆవిష్కర్తలను గుర్తించారు. 
► నగదు రహిత లావాదేవీలను ప్రోత్సహించేందుకు రాష్ట్ర ప్రభుత్వం నిర్వహిస్తున్న ‘టీ–వ్యాలెట్‌’యాప్‌ను 11 లక్షల మంది వినియోగదారులు క్రియాశీలంగా వాడుకుంటున్నారు. ఇప్పటి వరకు రూ.6,795 కోట్ల లావాదేవీలు దీని ద్వారా జరిగాయి. 
► ఐటీ ఇంక్యుబేటర్‌ ‘టీ–హబ్‌’ఇప్పటికే నాలుగేళ్లను పూర్తి చేసుకుంది. ఫేస్‌బుక్, యూటీసీ, బోయింగ్‌ వంటి కంపెనీలతో కార్పొరేట్‌ ఇన్నోవేషన్‌ ప్రోగ్రాంలను కొనసాగిస్తున్నది. 
► తెలంగాణ అకాడమీ ఫర్‌ స్కిల్‌ అండ్‌ నాలెడ్జ్‌ (టాస్క్‌) ద్వారా 3.50 లక్షల మంది నిరుద్యోగ యువతకు, 1,500 మంది అధ్యాపకులకు శిక్షణ ఇచ్చారు. 40కిపైగా కార్పొరేట్‌ కంపెనీలతో 4,500 మంది విద్యార్థులకు టాస్క్‌ ద్వారా ఉద్యోగావకాశాలు లభించాయి. 
► దేశ ఎలక్ట్రానిక్స్‌ ఉత్పత్తుల్లో తెలంగాణ వాటా 6 శాతం. 250కిపైగా కంపెనీలు రాష్ట్రంలో లక్షా 16 వేల మందికి నేరుగా ఉపాధి కల్పిస్తున్నాయి. 
► 2019లో తెలంగాణ ఎలక్ట్రానిక్స్‌ విభాగం రూ.7,337 కోట్ల పెట్టుబడులను తెచ్చింది. స్కైవర్త్‌ గ్రూప్, ఇన్నోలియా ఎనర్జీ వంటి భారీ పెట్టుబడులతో పాటు ప్రస్తుతం ఉన్న కంపెనీలు కూడా విస్తరణ కార్యక్రమాలను చేపట్టాయి. 
► మైక్రాన్‌ తన ఉద్యోగులను 700 నుంచి 2,000 పెంచింది. రూ.వెయ్యి కోట్ల పెట్టుబడితో వన్‌ ప్లస్‌ అతిపెద్ద ఆర్‌ అండ్‌ డీ సెంటర్‌ను హైదరాబాద్‌లో ఏర్పాటు చేయనున్నది.

Read latest Telangana News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు