ఆన్‌లైన్‌ డెలి'వర్రీ'!

16 Apr, 2020 11:30 IST|Sakshi

ఇ–కామర్స్‌ సేవలకు అనుమతుల కొర్రీ

20 నుంచి ఈ–కామర్స్‌ షాపింగ్‌కు పచ్చజెండా

కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల మధ్య సమన్వయ లోపమే జాప్యానికి కారణం

మరింత సమన్వయంతోనే పూర్తి స్థాయి అనుమతులు

ఆయా సంస్థల ఆవేదన

లాక్‌ డౌన్‌ నేపథ్యంలో ఈ నెల 20వ తేదీ నుంచి ఈ–కామర్స్‌ షాపింగ్‌లకు అనుమతి లభించింది.ఈ సందర్భంగా నగర వ్యాప్తంగా పెద్ద సంఖ్యలో ఉన్న ఆన్‌లైన్‌ షాపర్స్‌ వినియోగదారుల కోసం పలు ఈ–కామర్స్‌ సంస్థలు సేవలు ప్రారంభించనున్నాయి. అయితే తొలిదశ లాక్‌ డౌన్‌సమయంలో తమకు ఎదురైన అనుభవాలు పునరావృతం కాకుండా ఉండేలా అధికారులు చూడాలని ఆయా సంస్థల ప్రతినిధులు కోరుతున్నారు.

సాక్షి, సిటీబ్యూరో: ఈ–కామర్స్‌ సేవలకు ప్రభుత్వం పచ్చ జెండా ఊపినప్పటికీ నగరంలో పలు చోట్ల వేర్‌ హౌజ్‌లు ఇప్పటికీ మూతబడే ఉన్నాయి. దీనిపై ఇ–కామర్స్‌ ప్రతినిధులను సంప్రదించగా గత కొన్ని రోజులుగా ఆన్‌లైన్‌ డెలివరీ సంస్థలు నిత్యావసర సరుకుల సరఫరాలో అనేక సమస్యలు ఎదుర్కొన్నాయని, అనుమతులకు సరైన మార్గదర్శకాలు లేకపోవడంతో సరఫరాకు పలు అడ్డంకులు ఏర్పడ్డాయని ప్రముఖ ఆన్‌లైన్‌ వ్యాపార సంస్థ ప్రతినిధి చెప్పారు. తాము ఇప్పటిదాకా లాక్‌డౌన్‌ విజయానికి తమ వంతు మద్దతు ఇస్తూ నిత్యావసరాలు, మందులను ఇళ్లకు సరఫరా చేసే çప్రయత్నంలో ఉన్నప్పటికీ ప్రభుత్వ అనుమతుల జారీలోని లోటుపాట్లు తమ సేవలకు ఎక్కడికక్కడ అడ్డంగా మారుతున్నాయన్నారు.

సమన్వయలోపమే శాపం..!
అనుమతుల జారీకి సంబంధించి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల మధ్య సమన్వయ లోపం తాము అనుమతులను పొందడంలో జాప్యానికి కా రణమవుతోంది. ఈ అడ్డంకు లు తొలిగి 20 తర్వా త పూర్తి స్థాయి సేవలు పుంజుకోవాలంటే కేంద్ర, రాష్ట్రాల మధ్య అనుమతుల విషయంలో పూర్తి సమన్వయం ఉండాల్సిన అవసరం ఉందని అభిప్రాయపడ్డారు. అనుమతుల జారీ విషయంలో రాష్ట్రంలో  ఏ నగరానికి ఆ నగరం వేర్వేరు విధానాలను అనుసరిస్తోందని, అలాగే కొన్ని చోట్ల సేవలు ప్రారంభించడానికి అనుమతులు ఇస్తూ డెలి వరీ బాయ్స్‌కి ఇవ్వాల్సిన పాసుల జారీలో విపరీతమైన జాప్యం చేస్తున్నారన్నారు. ఇప్పటికే లాక్‌డౌన్‌ కార ణంగా వలసదారులు తమ తమ స్వస్థలాలకు వెళ్లేందుకు క్యూ కట్టడంతో తమకు అవసరమైన సంఖ్యలో స్థాయి సిబ్బంది లభించడం లేదంటున్నారు. నగరాలు, రాష్ట్రాల వ్యాప్త ంగా ఒక నిర్ధిష్టమైన విధానం లేకపోవడం కూడా పెద్ద సమస్యగా మారి ఆలస్యానికి, అనిశ్చితికి దారి తీస్తోందని మరో సంస్థకు చెందిన ఎగ్జిక్యూటీవ్‌ చెప్పారు. ఈ నేపథ్యంలో ఈ నెల 20వ తేదీ నుంచి తాము నగరంలో పూర్తిస్థాయి సేవలు ప్రారంభించాలంటే దానికి ప్రభుత్వ శా ఖలు సమన్వయంతో వ్యవహరించాలని వారు కోరుతున్నారు. 

మరిన్ని వార్తలు