లవర్స్‌కి ‘లైన్‌’ వేశారు!

14 Feb, 2019 10:27 IST|Sakshi

ఆన్‌లైన్, బయట మార్కెట్లలో గిఫ్ట్‌లు సిద్ధం

విభిన్న రూపాల్లో రోజ్‌ ఫ్లవర్స్‌

ప్రత్యేక డిన్నర్‌ ప్లానింగ్‌లో హోటళ్లు   

పబ్స్, రెస్టారెంట్లలో అలనాటి సంగీతం  

వలంటైన్స్‌ డే సందర్భంగా ప్రేమికులు తమకు నచ్చిన గిఫ్ట్‌లు ఇచ్చిపుచ్చుకోవడానికిసిద్ధమయ్యారు. దీంతో ఆన్‌లైన్, ఆఫ్‌లైన్‌ మార్కెట్ల నిర్వాహకులు వారికి ‘లైన్‌’వేస్తున్నారు. విభిన్న గిఫ్ట్‌లతో ప్రేమికుల మదిని దోచుకోనున్నారు. సిటీలోని పలురెస్టారెంట్‌లు, పబ్స్‌ నిర్వాహకులు ప్రేమికుల కోసం ఎన్నో వెరైటీ కార్యక్రమాలకుసన్నద్ధమవుతున్నారు.

ఫొటో ఆర్ట్‌ ఫర్‌ లవర్స్‌
ప్రపంచ వ్యాప్తంగా ‘గ్లోబల్‌ లగ్జరీ గ్రూప్‌’ వాళ్లు డిజిటల్‌ క్యాంపెయిన్‌ నిర్వహిస్తున్నారు. ప్రేమికుల దినోత్సవం సందర్భంగా వారం రోజుల పాటు ప్రపంచం మొత్తం మీద ఎవరైనా సరే తమకు నచ్చిన ఫొటోని
‘www.handpaintedstories.com’ వెబ్‌సైట్‌లో పోస్ట్‌ చేయాల్సి ఉంటుంది. పది నుంచి పదిహేను నిమిషాల వ్యవధిలో ఆ ఫొటోను ఆర్ట్‌గా గీసి తిరిగి వెబ్‌సైట్‌లోనే పోస్ట్‌ చేస్తారు. అంతే కాదు ఫొటోకు సంబంధించిన స్టోరీని కూడా పోస్ట్‌ చేస్తారు. ఇది లవర్స్‌కి ప్రత్యేకమనే చెప్పాలి.  

తక్కువ ధరల్లో చక్కటి గిఫ్ట్‌లు
ఫ్లిప్‌కార్ట్, అమెజాన్‌ వంటి ఆన్‌లైన్‌ మార్కెట్లలో కళ్లు జిగేల్‌మనిపించే గిఫ్ట్‌లు ఉన్నాయి. ప్రారంభ ధర రూ.99 నుంచి మనసుకు నచ్చినవి సొంతం చేసుకోవచ్చు. ఒక్క క్లిక్‌ కొడితే చాలు మనచేతిలో ఉంటాయి.   

కపుల్స్‌ డిన్నర్‌
సిటీలోని పలు హోటల్స్‌ కపుల్స్‌ కోసం డిన్నర్‌ను ప్లాన్‌ చేస్తున్నాయి. సాయంత్రం 6.30 గంటల నుంచి రాత్రి 11గంటల వరకు ‘పార్క్‌ హయత్, ది హ్యాత్, తాజ్‌బంజారా, తాజ్‌కృష్ణా, దసపల్లా’ లాంటి అనేక హోటల్స్‌ డిన్నర్‌ థీమ్‌ను ఏర్పాటు చేశాయి.    

షాపింగ్‌ అదుర్స్‌
అమ్మాయిల కోసం టాప్స్, జ్యువెలరీ, రింగ్స్, అబ్బాయిల కోసం వాచెస్, హ్యాండ్‌ జ్యువెలరీస్, నెక్‌ జ్యువెలరీస్‌ ప్రస్తుతం సిటీలోని షాపింగ్‌ మాల్స్‌లో హల్‌చల్‌ చేస్తున్నాయి. షాపర్స్‌ స్టాప్, సిటీసెంటర్, అన్‌లిమిటెడ్, మ్యాక్స్‌ వంటి ప్రధాన షోరూంలలో ఇవి అందుబాటులో ఉన్నాయి.  

పబ్స్‌లో అలనాటి గీతాలు
సిటీలోని పలు రెస్టారెంట్స్‌తో పాటు పబ్స్‌ కూడా కపుల్స్‌ కోసం అనేక కార్యక్రమాలను నిర్వహిస్తున్నాయి. పబ్స్‌లో వైట్‌డ్రస్‌లో కపుల్స్‌ని ఆహ్వానిస్తున్నారు. తెలుగు పాటలతో బ్యాండ్‌ కపుల్స్‌ కోసం అలనాటి పాటలను పాడుతూ వారిని ఎంటర్‌టైన్‌ చేసేందుకు సిద్ధమయ్యాయి.   

స్పెషల్‌ రోజెస్‌ ఫర్‌ లవర్స్‌
విభిన్న రకాల, కలర్స్‌లో ఉన్న రోజ్‌ ఫ్లవర్స్‌ ఆన్‌లైన్‌లో సందడి చేస్తున్నాయి. సిటీకి చెందిన సోనాల్‌ అగర్వాల్‌ ‘ఫ్లవర్‌వలీ’ పేరుతో రోజా పూలు విక్రయిస్తున్నారు. రోజా పూలతో పాటు టెక్నాలజీ ప్రింటెడ్‌ రోజెస్‌ అన్నీ సిటీలో, ఆన్‌లైన్‌లో సందడి చేస్తున్నాయి.  

Read latest Telangana News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు
సినిమా