ఎంసెట్‌ టెండర్లలో అక్రమాలు: కొనగల

22 Feb, 2017 02:54 IST|Sakshi

సాక్షి, హైదరాబాద్‌: ఎంసెట్‌ నిర్వహణ పనులను బహిరంగ టెండర్లు పిలవకుండానే మాగ్నెటిక్‌ ఇన్ఫోటెక్‌ సంస్థకు ప్రభుత్వం అప్పగించిందని, దీనిలో పెద్ద ఎత్తున అక్రమాలు జరిగాయని పీసీసీ అధికార ప్రతినిధి కొనగల మహేశ్‌ ఆరోపించారు. గాంధీభవన్‌లో మంగళవారం ఆయన విలేకరులతో మాట్లాడుతూ గతంలో అసమర్థంగా, అవకతవకలతో ఎంసెట్‌ను నిర్వహించిన మాగ్నెటిక్‌ కంపెనీకే ఉన్నత విద్యామండలి బాధ్యతలు అప్పగించిందన్నారు. ఎంసెట్‌ లీకేజీ వ్యవహారంపై నిష్పక్షపాతంగా విచారణ జరిగితే ఉన్నత విద్యామండలి చైర్మన్‌ పాపిరెడ్డి జైలులో ఉండేవార న్నారు. మంత్రి కేటీఆర్‌ జోక్యంతోనే అక్రమాలు జరిగాయని ఆరోపించారు

మరిన్ని వార్తలు