పోలీసుల దిగ్బంధనంలో ఉస్మానియా ఆస్పత్రి!

19 May, 2018 20:17 IST|Sakshi

సాక్షి, హైదరాబాద్‌: నగర పోలీసులు అనూహ్యంగా శనివారం సాయంత్రం ఉస్మానియా జనరల్ ఆస్పత్రిలో కార్డాన్ సెర్చ్ నిర్వహించారు. ఏకంగా 100 మంది ఈస్ట్ జోన్ పోలీసులు రంగంలోకి దిగి ఆస్పత్రిని  దిగ్బంధనం చేశారు. ఆస్పత్రిలో పలు అక్రమాలు జరుగుతున్నాయన్న సమాచారంతో పోలీసులు ఈ ఆకస్మిక కార్డన్‌ సెర్చ్‌ చేపట్టారు. ఆస్పత్రిలోని రోగులు,  వారి సహాయకుల నుంచి పోలీసులు వివరాలు సేకరించారు. ఈ సందర్భంగా పలువురు ఇన్సూరెన్స్ బ్రోకర్లను పోలీసుల అదుపులోకి తీసుకున్నారు. ఆస్పత్రిలోని రోగులను మాయమాటలతో మోసం చేసే దళారులనూ అదుపులోకి తీసుకున్నారు. యాక్సిడెంట్ కేసుల్లో ఇన్సూరెన్స్ ఇప్పిస్తామంటూ రోగులను మోసం చేస్తున్న బోకర్ల బాగోతం కార్డాన్ సెర్చ్‌లో బహిర్గతం అయింది. ఉస్మానియా ఆస్పత్రిలో పోలీసులు కార్డన్‌ సెర్చ్‌ నిర్వహించడం ఇదే తొలిసారి.

మరిన్ని వార్తలు