షెడ్యూల్ విడుదల చేసిన ఎన్నికల సంఘం

23 Dec, 2019 18:33 IST|Sakshi

జనవరి 22న ఎన్నికలు

సాక్షి, హైదరాబాద్‌: తెలంగాణలో మరో ఎన్నికల సంగ్రామం ప్రారంభం కాబోతుంది. రాష్ట్రంలో మున్సిపల్‌ ఎన్నికల నిర్వహణకు లైన్‌క్లియర్‌ అయ్యింది. మున్సిపల్‌ ఎన్నికలకు నగారా మోగింది. ఎన్నికలకు సంబంధించిన షెడ్యుల్‌ను రాష్ట్ర ఎన్నికల సంఘం సోమవారం ప్రకటించింది. జనవరి 7న నోటిఫికేషన్‌ విడుదల కానుంది. 8 నుంచి 10 వరకు నామినేషన్లు స్వీకరించనున్నారు. 11న నామినేషన్ల పరిశీలన, 14న ఉపసంహరణకు గడువు విధించారు. అలాగే 12, 13 తేదీల్లో తిరస్కరించిన నామినేషన్లను అప్పీలు చేసుకునే అవకాశం కల్పించారు. జనవరి 22న పోలింగ్‌ నిర్వహించి, 25న ఫలితాలను వెల్లడించనున్నారు. ఎన్నికల కోడ్‌ తక్షణమే అమల్లోకి రానుందని ఈసీ ప్రకటించింది. జనవరి బ్యాలెట్‌ పేపర్‌ పద్దతిలోనే ఎన్నికలు నిర్వహించనున్నట్లు ఈసీ అధికారులు తెలిపారు.

రాష్ట్రంలోని 121 మున్సిపాలిటీలు, 10 మున్సిపల్‌ కార్పొరేషన్ల ఎన్నికలు జరుగనున్నాయి. కాగా పురపాలక సంఘాలకు పదవీకాలం ముగిసినప్పటికీ వార్డుల విభజన, న్యాయ వివాదాల కారణంగా ఆలస్యమైన విషయం తెలిసిందే. కోర్టుల్లో సుదీర్ఘ వాదనల అనంతరం ఎన్నికలకు హైకోర్టు గ్రీన్‌ సిగ్నల్‌ ఇచ్చింది. దీంతో ఎన్నికల నిర్వహణకు ప్రభుత్వం చర్యలను వేగవంతం చేసింది.

మరిన్ని వార్తలు