ఈసీ ముందస్తు కసరత్తు ముమ్మరం

12 Sep, 2018 11:50 IST|Sakshi
కేంద్ర ఎన్నికల సంఘం భేటీకి హాజరైన ఉన్నతాధికారులు

సాక్షి, హైదరాబాద్‌ : తెలంగాణలో ముందస్తు ఎన్నికల నగారా మోగించేందుకు కసరత్తు వేగవంతమైంది. రాష్ట్రంలో బుధవారం రెండో రోజు కేంద్ర ఎన్నికల సంఘం తీరిక లేకుండా కార్యక్రమాలు నిర్వహించింది. జలమండలిలో 31 జిల్లాల ఉన్నతాధికారులతో సీఈసీ అధికారులు భేటీ అయ్యారు.


ఆలస్యంగా వచ్చిన కలెక్టర్లపై..
సీనియర్‌ డిప్యూటీ ఎన్నికల ప్రధానాధికారి ఉమేష్‌ సిన్హా నేతృత్వంలో జరిగిన ఈ సమావేశానికి జిల్లా కలెక్టర్లు, ఐజీలు, ఎస్పీలు హాజరయ్యారు. ఈ సమావేశానికి ఆలస్యంగా వచ్చిన కలెక్టర్లను సీఎస్‌ మందలించారు.కలెక్టర్లు రాజీవ్‌ హనుమంతు, దివ్య, శ్వేత మహంతి, భారతి హూలికెరి, అమేయ కుమార్‌లు సమావేశానికి ఆలస్యంగా వచ్చారు. కాగా సాయంత్రం 4.30కు సీఎస్‌, డీజీపీ, హోంశాఖ కార్యదర్శి, ఆర్థిక, ఎక్సైజ్‌, వాణిజ్య పన్నుల శాఖ ముఖ్య కార్యదర్శులతో సీఈసీ సభ్యులు సమావేశం కానున్నారు. అధికారులతో సమావేశాలు ముగిసిన అనంతరం సాయంత్రం సీఈసీ బృందం మీడియా సమావేశంలో పాల్గొంటుంది.
 

మరిన్ని వార్తలు