కేసీఆర్‌ ఫిర్యాదుపై స్పందించిన ఈసీ

8 Feb, 2019 17:31 IST|Sakshi

సాక్షి, న్యూఢిల్లీ: తెలంగాణ సీఎం కేసీఆర్‌ ఇచ్చిన ఫిర్యాదుపై కేంద్ర ఎన్నికల సంఘం(ఈసీఐ) స్పందించింది. కారు​ గుర్తును పోలిన సింబల్స్‌ వల్ల చాలా నియోజకవర్గాల్లో టీఆర్‌ఎస్‌ అభ్యర్థులకు నష్టం వాటిల్లిందని ఈసీకి కేసీఆర్‌ ఫిర్యాదు చేసిన విషయం తెలిసిందే. దీనిపై స్పందించిన ఈసీ కారు గుర్తు బోల్డ్‌(గుర్తు రంగు కనిపించేలా మార్పు) చేయడంపై టీఆర్‌ఎస్‌ సూచనలను కోరింది. ఈ మేరకు మార్పు చేసిన కారు​ గుర్తు సింబల్‌ను ఎంపీ వినోద్‌ కుమార్‌ ఎన్నికల సంఘానికి సమర్పించారు. అనంతరం మీడియాతో వినోద్‌ కుమార్‌ మాట్లాడారు.

ఓటర్లు గందరగోళానికి గురయ్యారు: వినోద్‌
ఎన్నికల బ్యాలెట్‌లో కారు రంగు సరిగా లేకపోవడంతో వృద్ధులు, కంటి సమస్య ఉన్న వారు తమ పార్టీ గుర్తును పోల్చుకోవడంలో ఇబ్బందులు పడ్డారని వినోద్‌ వివరించారు. మరో పార్టీకి సంబంధించిన ట్రక్కు గుర్తు, కారు గుర్తును పోలి ఉండటం వల్ల చాలా నియోజకవర్గాల్లో టీఆర్‌ఎస్‌ అభ్యర్థులు ఓటమిపాలయ్యారని పేర్కొన్నారు. గుర్తు మాత్రమే కాకుండా పేర్లు కూడా ఒకేలా ఉండేలా ఆ పార్టీ ఓటర్లను గందర గోళానికి గురిచేసిందన్నారు. ఇలాంటి తప్పులు వచ్చే పార్లమెంట్‌ ఎన్నికల్లో జరగకుండా చూడాలని కేసీఆర్‌ గతంలో ఎన్నికల సంఘాన్ని కోరారని గుర్తు చేశారు.

మరిన్ని వార్తలు