ఎడెసెట్‌కు చివరి గడువు మే 14

12 May, 2015 23:47 IST|Sakshi
ఎడెసెట్‌కు చివరి గడువు మే 14

హైదరాబాద్: తెలంగాణ స్టేట్ ఎడ్‌సెట్ -2015 ఆన్‌లైన్ దరఖాస్తుల స్వీకరణ గడువు 14న ముగియనున్నట్లు కన్వీనర్ ప్రొ.ప్రసాద్ చెప్పారు. ఇంత వరకు 60 వేలమంది అభ్యర్థులు దరఖాస్తు చేసుకున్నట్లు చెప్పారు. రూ.500 అపరాధ రుసుముతో ఈ నెల 21 వరకు దరఖాస్తు చేసుకోవచ్చని, ఈ నెల 30 నుంచి ఆన్‌లైన్ ద్వారా హాల్ టిక్కెట్లను డౌన్‌లోడ్ చేసుకోవచ్చని తెలిపారు.

మరిన్ని వార్తలు