కోవిడ్‌ 19 ఎఫెక్ట్‌: విద్యాశాఖ కీలక నిర్ణయం

4 Mar, 2020 22:16 IST|Sakshi

సాక్షి, హైదరాబాద్‌: తెలంగాణలో కరోనా(కోవిడ్‌-19) పాజిటివ్‌ కేసు నమోదయిన నేపథ్యంలో వైరస్‌ విస్తరించకుండా తెలంగాణ విద్యాశాఖ కీలక నిర్ణయం తీసుకుంది. ఇంటర్‌ విద్యార్థులు మాస్క్‌లు ధరించి పరీక్షలు రాయడానికి తెలంగాణ ఇంటర్మీడియట్ బోర్డ్ అనుమతినిచ్చింది. కరోనా వైరస్‌ వ్యాపించకుండా పరీక్ష కేంద్రాలను శుభ్రంగా ఉంచాలని సూపరింటెండెంట్లను ఆదేశించింది.  విద్యార్థులు వాటర్ బాటిల్స్ తెచ్చుకోవడానికి అనుమతిచ్చింది. కాగా దగ్గు, జలుబుతో బాధపడే విద్యార్థులకు ప్రత్యేక పరీక్షలు నిర్వహించనున్నారు. జలుబుతో బాధపడే ఇన్విజిలేటర్లకు విధుల నుంచి మినహాయింపు ఇవ్వాలని ఇంటర్మీడియట్ బోర్డ్ నిర్ణయించింది. (మైండ్‌ స్పేస్‌ ఖాళీ కాలేదు : సజ్జనార్‌)

మరిన్ని వార్తలు