విద్యపై వచ్చిన మంచి సినిమా..‘చదువుకోవాలి’

1 Dec, 2014 02:06 IST|Sakshi
  • అంతర్జాతీయ చలన చిత్రోత్సవంలో ప్రశంసలు
  • సాక్షి, హైదరాబాద్ : ఉత్తమ బాలల చిత్రం ‘చదువుకోవాలి’  అంతర్జాతీయ చలన చిత్రోత్సవంలో ప్రశంసలను అందుకుంది. గోవాలో జరుగుతున్న 2014 ఫిలిం ఫెస్టివల్‌లో ఈ చిత్రాన్ని ప్రదర్శించిన దర్శకుడు, రచయిత ఎం.వెంకటేశ్వరరావును కేంద్ర సమాచార ప్రసార శాఖ అధికారులు అభినందించారు. గోవా ఎంటర్‌టైన్‌మెంట్ సొసైటీ జీఎం శ్రీపాద్‌నాయక్, ఐఎఫ్‌ఎఫ్‌ఐ అధికారి ముఖేష్‌చంద్ విద్య ఇతివృత్తంగా వచ్చిన మంచి సినిమా అని ప్రశంసించారు.  ఐఎఫ్‌ఎఫ్‌ఐ తరఫున దర్శకుడు వెంకటేశ్వరరావుకు ప్రత్యేక మెమెంటోను బహుకరించారు. చిత్రానికి సంబంధించిన డీవీడీని సీపీఐ కేంద్ర కార్యదర్శి, ఎంపీ డి.రాజాకు అందజేశారు.

>
మరిన్ని వార్తలు