విద్యారంగ సమస్యలు పరిష్కరించాలి

21 Jul, 2018 13:31 IST|Sakshi
మాట్లాడుతున్న బిట్టు  

నిర్మల్‌టౌన్‌: టీఆర్‌ఎస్‌ ప్రభుత్వం ఏర్పడి నాలుగేళ్లు గడుస్తున్నా విద్యారంగ సమస్యలు మాత్రం ఎక్కడ వేసిన గొంగళి అక్కడే అన్న చందంగానే మిగిలాయని టీఎన్‌ఎస్‌ఎఫ్‌ జిల్లా అధ్యక్షుడు పూదరి బిట్టు, జిల్లా ప్రధాన కార్యదర్శి ఆరె శేఖర్‌ విమర్శించారు. జిల్లా కేంద్రంలోని ఆర్‌అండ్‌బీ విశ్రాంతి భవనంలో శుక్రవారం విలేకరుల సమావేశంలో మాట్లాడారు. ప్రభుత్వ పాఠశాలలు పటిష్టపరిచేందుకు ప్రభుత్వం తగిన చర్యలు తీసుకోవాలన్నారు.

అలాగే సంక్షేమ హాస్టళ్లలో సమస్యలు పరిష్కరించడంతో పాటు సొంత భవనాలు నిర్మించాలని కోరారు. పెండింగ్‌ ఫీజు రీయింబర్స్‌మెంట్‌ వెంటనే విడుదల చేయాలని డిమాండ్‌ చేశారు. కేజీ టూ పీజీ విద్యను ఇప్పటివరకు ప్రభుత్వం అమలు చేయకపోవడం సిగ్గుచేటన్నారు. ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి విద్యారంగ సమస్యలు పరిష్కరించాలని, లేకపోతే టీఎన్‌ఎస్‌ఎఫ్‌ ఆధ్వర్యంలో ఆందోళనలు చేస్తామని హెచ్చరించారు. ఇందులో కార్యనిర్వాహక కార్యదర్శి భూషణ్, వినోద్, కైలాశ్, యోగేశ్‌ తదితరులున్నారు.

మరిన్ని వార్తలు