లాక్‌డౌన్‌ సమయంలో ఇఫ్లూ పరీక్షలు..

7 Jun, 2020 22:23 IST|Sakshi

హైదరాబాద్‌: కరోనా వైరస్‌, లాక్‌డౌన్‌ పరిస్థితుల్లో కూడా ఇఫ్లూ (ఇంగ్లీష్ అండ్ ఫారెన్ లాంగ్వేజెస్ యూనివర్శిటీ) చివరి సెమిస్టర్‌ పరీక్షలను నిర్వహించింది. లాక్‌డౌన్‌ సమయంలో పరీక్షలు నిర్వహించిన మెదటి కేంద్రీయ విశ్వవిద్యాలయంగా ఇఫ్లూ రికార్డు సృష్టించింది. దేశంలోనే విదేశీ భాషల శిక్షణకు ఇఫ్లూ(కేంద్రీయ విశ్వవిద్యాలయం)  ఎంతో పేరు పొందిన విషయం తెలిసిందే. పరీక్షలు విజయవంతం కావడానికి  వైస్ చాన్సెలర్  ప్రొఫెసర్ ఈ.సురేష్ కుమార్, విద్యార్థుల కృషితో సాధ్యమయిందని ఇఫ్లూ తెలిపింది. పరీక్షల నిర్వహణకు అధ్యాపకులు ఎంతో కృషి చేశారని వీసీ కొనియాడారు. కరోనా వైరస్‌ను ఎదుర్కొని విద్యాసంవత్సరం విజయవంతంగా పూర్తి చేశామని ఇప్లు తెలిపింది. ప్రస్తుతం షిల్లాంగ్‌లోని తమ ప్రాంతీయ క్యాంపస్‌లో ఆన్‌లైన్‌ ద్వారా పరీక్షలు కొనసాగుతున్నాయని తెలిపింది.

దేశంలోని పీహెచ్‌డీ స్కాలర్లకు వైవా పరీక్షలు నిర్వహించిన మొదటి విశ్వవిద్యాలయంగా చరిత్ర సృష్టించామని పేర్కొంది. ఇప్పటి వరకు 15 వైవా పరీక్షలు నిర్వహించినట్లు తెలిపింది. సామాజిక సేవలలో కూడా ఇఫ్లూ ముందుందని.. కరోనా నియంత్రణకు వివిధ రూపాలలో చర్యలు చేపట్టామని తెలిపింది. ఇఫ్లూలో కరోనా నియంత్రణకు 23 ఏప్రిల్, 2020 న కేంద్ర మంత్రి డాక్టర్ రమేష్ పోఖ్రియాల్ నిశాంక్ ఇప్లులో షార్ట్ ఫిల్మ్‌ సంస్థను ప్రారంభించారు. విదేశీ భాషలకు ప్రత్యేకంగా ఉచిత ఆన్‌లైన్, ఓపెన్ ఎడ్యుకేషనల్ రిసోర్సెస్ ద్వారా ఇంగ్లీష్, సంస్కృతం, హిందీ, రష్యన్, జర్మన్, ఫ్రెంచ్, అరబిక్, స్పానిష్, ఇటాలియన్, జపనీస్, కొరియన్, చైనీస్, పెర్షియన్ భాషలలో అందిస్తోంది.

కరోనాను నియంత్రించేందుకు ఎఫ్‌ఎమ్‌ రేడియో ద్వారా అవగాహన కలిగించామని తెలిపింది. విద్యార్థులు ఇబ్బందులను దృష్టిలో పెట్టడానికి ఆన్‌లైన్‌ శిక్షణను సమర్థవంతంగా కొనసాగించామని పేర్కొంది.  హాస్టల్‌లో నివసించే విదేశీ విద్యార్థులను నిరంతరం పర్యవేక్షిస్తున్నామని తెలిపారు. కరోనావైరస్‌ను ఎదుర్కొని.. విద్యాసంవత్సరం విజయవంతంగా పూర్తి చేయడంలో విద్యార్థులు, బోధన, బోధనేతర సిబ్బందికి వైస్ ఛాన్సలర్ సురేష్‌ కుమార్‌ కృతజ్ఞతలు తెలిపారు. విద్యార్ధులు ఎన్నుకున్న రంగంలో రాణించాలని.. వారు జీవితంలో అత్యున్నత స్థాయిలో ఎదగాలని వీసీ సురేష్‌ కుమార్‌ ఆకాంక్షించారు

మరిన్ని వార్తలు