రోడ్డు ప్రమాదం.. పాపం చిన్నారి..

4 Oct, 2019 15:20 IST|Sakshi

సాక్షి, వరంగల్‌: ఉమ్మడి వరంగల్ జిల్లాలో శుక్రవారం జరిగిన రెండు వేర్వేరు రోడ్డు ప్రమాదాలలో ఏడుగురు దుర్మరణం పాలయ్యారు. ములుగు జిల్లా ములుగు మండలం మహమ్మద్ గౌస్ పల్లి సమీపంలో కారు‌-అంబులెన్స్ ఢీకొన్న దుర్ఘటనలో నలుగురు మృతి చెందారు. మరో నలుగురికి తీవ్ర గాయాలయ్యాయి. అతివేగంగా వచ్చిన కారు(ఏపీ 20ఏయూ 2198) అదుపుతప్పి ముందున్న మరో కారును ఢీకొట్టి ఎదురుగా వస్తున్న అంబులెన్స్‌ను గుద్దుకోవడంతో ఈ ప్రమాదం చోటు చేసుకుంది. మృతుల్లో ఎనిమిది నెలల పసికందు ఉంది. సీటు మధ్యలో ఇర్కుపోయి చిన్నారి ప్రాణాలు కోల్పోవడం అందరినీ కంటతడి పెట్టించింది. ప్రమాదం గురించి తెలిసిన వెంటనే పోలీసులు స్థానికుల సహాయంతో సహాయక చర్యలు చేపట్టారు. క్షతగాత్రులను సమీపంలోని ఆస్పత్రికి తరలించారు.


ఈ ప్రమాదంలో వాజేడు వెంకటపూర్‌కు చెందిన బానోతు సోనాల్, అతని భార్య రజిత, వీరి చిన్న పాప, మరో వ్యక్తి మృతి చెందారు. వీరు కారులో వెంకటపూర్ నుండి హైదరాబాద్‌కు వెళుతున్న క్రమంలో మొదట వరంగల్ నుండి ములుగు వెళుతున్న తిరుపతి రెడ్డి కారును ఢీకొట్టి తర్వాత ఎదురుగా వస్తున్న పోలీస్ అంబులెన్స్ వ్యాన్‌ను గుద్దుకుంది. ప్రమాద సమయంలో చిన్నారితో సహా కారులో ఏడుగురు ఉన్నారు. వీరిలో పాపతో పాటు నలుగురు ప్రాణాలు కోల్పోయారు.


జనగామ జిల్లా దేవరుప్పుల మండలం సింగరాజుపల్లి వద్ద రెండు కార్లు ఢీకొన్న మరో ప్రమాదంలో ముగ్గురు మృతి చెందారు. మరో నలుగురికి తీవ్ర గాయాలయ్యాయి. వీరిని జనగామ ఏరియా ఆస్పత్రికి తరలించారు. ప్రమాదానికి గల కారణాలు వెల్లడి కావాల్సివుంది. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని దర్యాప్తు చేపట్టారు. మృతులు, క్షతగాత్రులు జనగామ ప్రాంత వాసులుగా గుర్తించారు. పెద్దామడుర్ వాసి కృష్ణ, జనగామకు చెందిన మందిప్, సోమా నర్సయ్య ప్రాణాలు కోల్పోయారు. పెద్దమడుర్ గ్రామానికి చెందిన వారు పండుగ షాపింగ్ కోసం జనగామకు వెళ్తుండగా, మరో కారులోని వారు బర్త్ డే పార్టీ కోసం దేవురుప్పుల వైపు వెళ్తుండగా ఘటన చోటుచేసుకుంది. 

Read latest Telangana News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు

ఆర్టీసీ కార్మికులకు తీవ్ర హెచ్చరిక

‘ప్రజలకు ఇబ్బంది కలగకుండా చూడండి’

అమిత్‌ షాతో కేసీఆర్‌ 40 నిమిషాల భేటీ

లెక‍్చరర్స్‌ ఫోరం అధ్యక్షుడి ఇంట్లో ఏసీబీ సోదాలు

చర్చలు విఫలం, అర్థరాత్రి నుంచి ఆర్టీసీ సమ్మె

స్టోరంతా తిరిగి కొనుక్కునే చాన్స్‌

దోమ కాటుకు చేప దెబ్బ

తాత్కాలిక డ్రైవర్‌కు రూ.1,500, కండక్టర్‌కు రూ.వెయ్యి

పేద కుటుంబం.. పెద్ద కష్టం

రోడ్డుపై నీటిని వదిలినందుకు రూ. 2లక్షల జరిమానా

ఊరెళ్తున్నారా? పోలీసులకు చెప్పండి

ఆ మూడు ఇళ్లకు జరిమానా వేయండి: మంత్రి

సమ్మెట.. ఎట్లనన్నా పోవాలె..

అన్నదమ్ముల ప్రాణం తీసిన పండుగ సెలవులు

షి ఈజ్‌ సెలబ్రిటీ క్వీన్‌

పండగ వేళ జీతాల్లేవ్‌!

కేటీఆర్‌ సంతకం ఫోర్జరీ చేసిన ‘మంగళ’

అసెంబ్లీలో కేసీఆర్‌ హామీ ఇచ్చినా ఫలితం శూన్యం

బాధ్యతలు స్వీకరించిన మంత్రి ‘గంగుల’

నటుడు దామరాజు కన్నుమూత

'అక్కడ' ముందస్తు దసరా ఉత్సవాలు!

పెరగనున్న కిక్కు!

తాత్కాలిక పద్ధతిలో డ్రైవర్లు, కండక్టర్ల ఎంపిక

నిజాం నిధుల్లో.. ఎవరికెంత!

డంపింగ్‌ యార్డుల్లా పోలీస్‌ శిక్షణ కేంద్రాలు

యూనివర్సిటీల్లో డేటా బ్యాంక్‌

13 వరకు సెలవులో సిద్దిపేట కలెక్టర్‌

లిక్కర్‌.. లిక్విడ్‌ క్యాష్‌

రెండు నెలలు కాలేదు.. అప్పుడే..

ఆంధ్రప్రదేశ్
తెలంగాణ
సినిమా

అల్లు ఫ్యామిలీ ‘సైరా’ పార్టీ

యూట్యూబ్‌ సెలబ్స్‌

సైరా కోసం గుండు కొట్టించిన రామ్‌చరణ్‌!

సైరా ‘లక్ష్మి’కి ఉపాసన సూపర్‌ గిఫ్ట్‌

బిగ్‌బాస్‌: పుల్లలు పెట్టడం స్టార్ట్‌ చేసిన మహేశ్‌

ఘనంగా హీరోయిన్‌ నిశ్చితార్థం