జోరుగా టీఆర్‌ఎస్‌ నాయకుల ప్రచారం..

19 Nov, 2018 18:56 IST|Sakshi
చిన్నకొత్తపల్లిలో ఇంటింటి ప్రచారం చేస్తున్న రమేష్‌

 సాక్షి, కోడేరు: మండలంలోని జనుంపల్లి, నాగులపల్లి, బాడిగదిన్నె తదితర గ్రామాల్లో నియోజకవర్గ అభివృద్ధికి మారుపేరుగా నిలిచిన మంత్రి జూపల్లి కృష్ణారావు ఎన్నికల్లో అత్యధిక మెజార్టీతో గెలిపించాలని ఆదివారం టీఆర్‌ఎస్‌ మండల యూత్‌ నాయకులు రవీందర్, మాజీ వార్డు సభ్యులు రాజు, బుగ్గస్వామి, పరమేష్‌ ఇంటింటి ప్రచారం నిర్వహించారు. ఈ ఎన్నికల్లో మంత్రి జూపల్లి కృష్ణారావుకు పట్టం కట్టాలని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో శివ, రాజు, వంశీధర్‌రావు, రాజు, మాసుం తదితరులు పాల్గొన్నారు. 

పెంట్లవెల్లి: మండల కేంద్రమైన పెంట్లవెల్లి, మాధవస్వామినగర్, మంచాలకట్ట తదితర గ్రామాల్లో టీఆర్‌ఎస్‌ కార్యకర్తల ప్రచారం జోరుగా నిర్వహిస్తున్నారు. టీఆర్‌ఎస్‌ను గెలిపించడానికే ఈ ప్రచారం చేస్తున్నామని టీఆర్‌ఎస్‌ యూత్‌ వింగ్‌ తాలుకా ఇన్‌చార్జ్‌ కేతూరి ధర్మతేజ అన్నారు. ఎటు చూసినా టీఆర్‌ఎస్‌ కార్యకర్తలే ప్రచారం చేస్తున్నారని, తెలంగాణ ఏర్పడినప్పటి నుంచి ఇప్పటి వరకు ఎన్నో సంక్షేమ కార్యక్రమాలు చేపట్టారని ప్లకార్డులతో విస్తృత స్థాయి ప్రచారం చేశారు. టీఆర్‌ఎస్‌ చేపట్టిన పథకాలు, చేయబోయే పథకాల గురించి వివరించారు. కొల్లాపూర్‌ పరిధిలో కూడా మంత్రి జూపల్లి కృష్ణారావు గెలవడం తథ్యమన్నారు. శివకుమార్, కృష్ణ, శివకుమార్, కుర్మయ్య తదితరులు పాల్గొన్నారు. 

పెద్దకొత్తపల్లి: మండలంలోని చిన్నకొత్తపల్లి, చెన్నపురావుపల్లిలో టీఆర్‌ఎస్‌ నాయకులు విద్యార్థి విభాగం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి రమేష్‌ జూపల్లి కృష్ణారావుకు ఓట్లు వేయాలని కోరుతూ ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. టీఆర్‌ఎస్‌ ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు రైతు సంక్షేమం కోసం రైతుబంధు, రైతులకు 24గంటల కరెంట్, ఉచిత విద్యుత్‌ వంటి పథకాలను అందించిందన్నారు. ఇవి కొనసాగాలంటే కృష్ణారావుకు ఓట్లు వేసి గెలిపించాలని ఇంటింటి ప్రచారం నిర్వహించారు. కార్యక్రమంలో శివ, రాము తదితరులు పాల్గొన్నారు. 

కొల్లాపూర్‌ రూరల్‌: మండలంలోని రామాపురంలో జూపల్లి తనయుడు జూపల్లి అరుణ్‌ ఇంటింటి ప్రచారం చేశారు. నాలుగున్నరేళ్ల నుంచి మాజీ మంత్రి జూపల్లి కృష్ణారావు ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టి కొల్లాపూర్‌ను అన్నిరంగాల్లో ముందుంచారన్నారు. ప్రతి గ్రామంలో సాగు, తాగునీటి కోసం కృషిచేశారన్నారు. సీసీరోడ్ల నిర్మాణాల కోసం పూర్తిస్థాయి నిధులను మంజూరు చేయించి ప్రతి గ్రామంలో సీసీరోడ్డు వేయడం జరిగిందన్నారు. తెలంగాణ ప్రభుత్వం ప్రజలకు వివిధ రకాల పథకాలు అందించడం జరిగిందన్నారు. మరోసారి మంత్రి జూపల్లి కృష్ణారావును అఖండ మెజార్టీతో గెలిపించాలని ప్రజలకు పిలుపునిచ్చారు. ప్రతి ఇంటికి వెళ్లి టీఆర్‌ఎస్‌ ఎన్నికల ప్రణాళికను పంపిణీ చేసి ఓటర్లను అభ్యర్థించారు. కార్యక్రమంలో మాజీ సర్పంచ్‌ బాల్‌రాజు, టీఆర్‌ఎస్‌ యూత్‌ తాలుకా కోఆర్డినేటర్‌ ధర్మతేజ, గోపాలకృష్ణ, శరబంద, మహేష్, శ్రీనివాసరావు, మధు తదితర నాయకులు ఉన్నారు. 

మరిన్ని వార్తలు