మీ క్షేమమే నే కోరుకున్నా..

29 Nov, 2018 09:47 IST|Sakshi

సాక్షి, వరంగల్‌ : మీ సుఖమే నే కోరుకున్నా.. ఎవరో ప్రేమ విఫలడు పాడుతున్నాడు అనుకున్నారా కాదండి నేటి  తెలంగాణ రాష్ట్ర ప్రచారాల్లో రాజకీయనేతలు  ప్రజల క్షేమం కోసం పనులు చేస్తూ ప్రేమికుల కంటే ఎక్కువగా ప్రజలను ప్రేమిస్తూ ఓటర్లను ఆకర్షిస్తున్నారు. ఒకరు మీరు చల్లగా ఉండాలి అని పూజలు చేస్తున్నాం అంటే ఇంకొకరు మీకు కష్టం రాకుండా మీ పనులు చేస్తాం అంటూ తాపీ పని,చేనేత, వెల్డింగ్‌ ఇలా పనులన్నీ చేస్తూ ప్రచారాలు చేస్తున్నారు.

 గోడ నిర్మిస్తా.. ఓట్లు రాల్చుతా

మహబూబాబాద్‌ : తాపీ పని చేస్తున్న భారతీయ జనతాపార్టీ మానుకోట ఎమ్మెల్యే అభ్యర్థి హుస్సేన్‌ నాయక్‌

మగ్గం పని చేస్తా.. ఓట్లు అడుగుతా

జనగామ : ఎన్నికల ప్రచారంలో భాగంగా చేనేత కార్మికులతో మాట్లాడుతున్న కాంగ్రెస్‌ జనగామ నియోజకవర్గ అభ్యర్థి పొన్నాల లక్ష్మయ్య

తాటి కల్లు మంచిగున్నది..

పర్వతగిరి : ప్రచారంలో భాగంగా చింతనెక్కొండలో కల్లు తాగుతున్న టీఆర్‌ఎస్‌ వర్ధన్నపేట అభ్యర్థి అరూరి రమేష్‌

నేను వెల్డింగ్‌ చేస్తా..

జనగామ: వెల్డింగ్‌ చేస్తున్న టీఆర్‌ఎస్‌ జనగామ ఎమ్మెల్యే అభ్యర్థి ముత్తిరెడ్డి యాదగిరిరెడ్డి

పేదల బతుకులు మార్చే బతుకమ్మను..

రాంనగర్‌లో బతుకమ్మ ఎత్తుకుని ప్రచారం నిర్వహిస్తున్న కాంగ్రెస్‌ ములుగు అభ్యర్థి సీతక్క

మరిన్ని వార్తలు