ఈసీ కీలక నిర్ణయం.. టీఆర్‌ఎస్‌కు ఊరట

26 Feb, 2019 15:05 IST|Sakshi

సాక్షి, హైదరాబాద్‌: తెలంగాణ రాష్ట్ర సమితి (టీఆర్‌ఎస్‌) పార్టీ గుర్తు కారును పోలి ఉన్న ట్రక్కును తొలగిస్తున్నట్లు కేంద్ర ఎన్నికల సంఘం ప్రకటించింది. ఈ మేరకు ట్రక్కు, ఇస్రీపెట్టె గుర్తులను ప్రీ సింబల్స్‌ జాబితా నుంచి తొలగిస్తున్నట్లు ఈసీ మంగళవారం ఉత్తర్వులు జారీచేసింది. తెలంగాణ సీఎం కేసీఆర్‌ ఫిర్యాదు మేరకు సీఈసీ నిర్ణయం తీసుకుంది. ఇకపై ట్రక్కు గుర్తును ఎవ్వరికీ కేటాయించమని ఈసీ తెలిపింది. కాగా తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో కారును పోలిన ట్రక్కు గుర్తు కారణంగా పలు నియోజకవర్గాల్లో ఫలితాలు తారుమారు అయ్యాయని కేసీఆర్‌ ఈసీకి ఫిర్యాదు చేసిన విషయం తెలిసిందే.

సత్తుపల్లి, ధర్మపురి నియోజకవర్గల్లో ఓట్లు తక్కువ రావడానికి ట్రక్కు గుర్తే కారణమని కేసీఆర్‌ ఫిర్యాదులో పేర్కొన్నారు. కాగా లోక్‌సభ ఎన్నికలు సమీపిస్తున్న నేపథ్యంలో ఈసీ నిర్ణయం టీఆర్‌ఎస్‌కు పెద్ద ఊరట కలిగించే అంశం. ఈసీ నిర్ణయంపై టీఆర్‌ఎస్‌ నేతలు హర్షం వ్యక్తం చేశారు.

మరిన్ని వార్తలు