ఎన్నికల మార్గదర్శకాలను వివరించిన కలెక్టర్‌

6 Nov, 2018 11:11 IST|Sakshi

    జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్‌ అనితారామచంద్రన్‌ 

సాక్షి, యాదాద్రి : మండల అభివృద్ధి అధికారులు తమ మండలాల పరిధిలో ఎన్నికల మోడల్‌ కోడ్‌ కచ్చితంగా అమలు పర్చేందుకు అన్ని చర్యలు తీ సుకోవాలని జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్‌ అని తారామచంద్రన్‌ కోరారు. కలెక్టర్‌ సోమవారం కలెక్టరేట్‌ మీటింగ్‌ హాలులో మండల అభివృద్ధి అధి కారులతో సమావేశమై ఎన్నికల మార్గదర్శకాలను వివరించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడా రు. మండలంలోని ఆశవర్కర్లు, ఉపాధి హామీ ప థకంలో పని చేస్తున్న క్షేత్రస్థాయి సిబ్బంది, ఇతర పొరుగు సేవల ఉద్యోగులు ఎవరూ కూడా ఎన్నికల్లో ప్రత్యక్షంగా గాని, పరోక్షంగా కాని పాల్గొనకుండా అన్నిచర్యలు తీసుకోవాలని కోరారు. పార్టీ ల ప్రచారాల్లో పాల్గొనకుండా అవగాహన కలిగిం చాలన్నారు. 

స్వయం సహాయక సంఘాలు డబ్బు ల పంపిణీ ఇతర కార్యక్రమాలలో పాల్గొనడం ఉపేక్షించరాదని, అదే విధంగా రేషన్‌డీలర్లకు కూ డా ఈవిషయంలో అవగాహన కలిగించాలని సూ చించారు. కొత్తగా సీసీరోడ్లు వేయడం, బోర్లు వే యడం, కొత్తగా పనుల మంజూరు ప్రారంభించ డం అన్ని కూడా ఎన్నికల కోడ్‌ పరిధిలోకి వస్తాయ ని వాటిని గ్రహించాలన్నారు. ఉద్యోగులు ప్రభు త్వ వేతనం పొందుతూ ఎన్నికల ప్రచారాల్లో పా ల్గొని ఉద్యోగాలు కోల్పోవడం, ప్రమోషన్‌లు, రిటైర్‌మెంట్‌ సమయంలో బెనిఫిట్లు కోల్పోరాదన్నా రు. ఈవిషయంపై అవగాహన కలిగి ఉండాలన్నారు. 

దివ్యాంగులు తమ ఓటు హక్కు సద్వినియోగపర్చుకునేందుకు పోలింగ్‌ కేంద్రాల్లో ర్యాంపుల నిర్మాణం, వీల్‌చైర్స్‌ ఏర్పాటుతో పాటుగా వారిని ఆటోలో తీసుకువచ్చేందుకు ఎన్నికల కమిషన్‌ ఆదేశాలు మేరకు అన్ని చర్యలు చేపడుతున్నందున పనులు పర్యవేక్షించాలన్నారు. అర్హులైన వారు ఓటరుగా నమోదుకు 9వ తేదీచివరి గడువు అయినందున బీఎల్‌ఓల ద్వారా ఫారం–6 ద్వారా ఓటరుగా నమోదు చేయించాలన్నారు. దివ్యాంగులకు తోడ్పాటు నందించేందుకు అంగన్‌వాడీలను వలంటీర్‌గా పెట్టి వారికి శిక్షణ కార్యక్రమాలు నిర్వహించాలన్నారు. తహసీల్దార్, ఎంపీడీఓలు కలిసి మండల స్థాయి పార్టీ అధ్యక్షులతో సమావేశాలు పెట్టి మోడల్‌ కోడ్‌పై అవగాహన పర్చాల న్నారు. 

చెల్లింపు వార్తలు, ప్రీసర్టిఫికేషన్‌ పొందడం ప్రకటనలు జారీ తదితర విషయాలపై ఎంపీడీఓలకు అవగాహన కలిగించారు. సీవిజిల్‌ నోడల్‌ అధికారి ప్రియాంక మాట్లాడుతూ మోడల్‌ కోడ్‌ ఉల్లంఘించిన సంఘటనలపై ఫొటో, వీడియో క్లిప్పింగ్‌ ఆధారాలతో ఫిర్యాదు చేసేందుకు సీవిజిల్‌ యాప్‌ డౌన్‌లోడ్‌ చేసుకునేలా అవగాహనపర్చాలన్నారు. అదే విధంగా సువిధ ఆన్‌లైన్‌ పోర్టల్‌ ద్వారా అనుమతులు పొందడంపై వివరించారు. ఈ సమావేశంలో ఆలేరు ఆర్‌ఓ ఉపేందర్‌రెడ్డి, ఎంపీడీఓలు పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు