పోలీసులకూ నో ఎంట్రీ..

28 Mar, 2019 17:50 IST|Sakshi

ఎన్నికల అధికారి కోరితేనే పోలింగ్‌ బూత్‌లోకి వెళ్లాలి

ప్రత్యేక పరిస్థితుల్లోనే వెళ్లేందుకు అనుమతి

జహీరాబాద్‌: పోలీసులు అంటే ఎప్పుడైనా ఎక్కడికైనా వెళ్లి విచారణ చేసే అధికారం ఉంటుంది. అయినా ఎన్నికల సమయంలో పోలింగ్‌ బూత్‌లోకి వెళ్లే అధికారం పోలీసులకు ఎన్నికల సంఘం కల్పించలేదు. ఎన్నికల అధికారి కోరిన సమయంలో కానీ, అత్యవసర పరిస్థితులు ఏర్పడిన సమయంలో మాత్రమే పోలింగ్‌ బూత్‌లోకి వెళ్లే అధికారం ఉంటుంది. అది కూడా ఎన్నికల అధికారికి అధికారం ఉంటేనే.

  • పోటీచేసిన అభ్యర్థికి జెడ్‌ ప్లస్‌ కేటగిరి భద్రత ఉన్నప్పటికీ రక్షణ సిబ్బందికి పోలింగ్‌బూత్‌లోకి అనుమతి లేదు. అభ్యర్థితో పాటు మఫ్టీలో ఉన్న భద్రతా సిబ్బందిలో ఒకరు మాత్రమే వెళ్లేందుకు అనుమతినిస్తారు.
  •  కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల కేబినెట్, రాష్ట్ర మంత్రులు, ఉప ముఖ్యమంత్రులకు ప్రజల ఖర్చుతో భద్రత ఉంటుంది. వీరికి తమ వెంట వచ్చే భద్రతా సిబ్బందికి కూడా ప్రవేశం లేదు. ఎన్నికల్లో పోటీ చేస్తున్న అభ్యర్థిగా మంత్రి ఉంటే ఆయన ఒక్కరు మాత్రమే పోలింగ్‌బూత్‌లోకి వెళ్లవచ్చు. భద్రతా సిబ్బంది తలుపు బయటే ఆగిపోవాలి.
  • పోలీసు సిబ్బంది ఎన్నికల అధికారుల ఆదేశాలను మాత్రమే అనుసరించాలి. రాజకీయ నాయకులు, మంత్రుల మాటలను పట్టించుకోవద్దు. ఎన్నికల కమిషన్‌ ఆజ్ఞాపత్రం ఉంటేనే పోలింగ్‌ బూత్‌ లోపలకు వెళ్లవచ్చు. అక్కడ ఓటర్లను ప్రభావితం చేసేలా ప్రవర్తించరాదు. మాటలు, సైగలు చేసినా నేరం కిందకే వస్తుంది.  

మరిన్ని వార్తలు