ప్రతిపైసా లెక్క చెప్పాలి

2 Apr, 2019 18:35 IST|Sakshi
అభ్యర్థుల ఖర్చుల వివరాల  పరిశీలిస్తున్న దృశ్యం 

ఎన్నికల వ్యయ పరిశీలకుడు ఎంకే.శర్మ 

సాక్షి, మహబూబాబాద్‌: ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థుల ప్రతి పైసా లెక్క కట్టడం జరుగుతుందని కేంద్ర ఎన్నికల సంఘం నుంచి నియమింపబడిన ఎన్నికల వ్యయ పరిశీలకులు ఎంకే.శర్మ, నితిన్‌జైన్‌ అన్నారు. కలెక్టరేట్‌ సమావేశ మందిరంలో మహబూబాబాద్‌ పార్లమెంట్‌ నియోజకవర్గంలో పోటీ చేసే అభ్యర్థుల ఖర్చుల లీస్టులను వారు సోమవారం పరిశీలించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. ఖర్చు చేసిన వివరాల పరిశీలన నేడు మొదటి దశ అయిపోయిందన్నారు. ఈ నెల 5న రెండో దశ, 9న మూడో ద శ, ఆ తరువాత తుది పరిశీలన ఉంటుందన్నారు. బృందాలను నియమించి అభ్యర్థులు చేసిన ప్రతి పైసాపై నిఘా ఉంచి లెక్క చేయడం జరుగుతుందన్నారు.

పోటీ చేసే 14 మందిలో కేవలం 8 మంది అభ్యర్థుల ప్రతినిధులు ఖర్చుల వివరాలు సక్రమంగా సమర్పించలేదని, నిబంధనలు అనుసరించి తిరిగి సమర్పించాల్సిందిగా నోటీసులు జారీ చేశామన్నారు. పోటీలో ఉన్న అభ్యర్థుల ఖర్చులను ఎప్పటికప్పుడు నమోదు చేస్తున్నట్లుగా తెలిపారు. వ్యయ పరిశీలకుల రిజిస్టర్లు, అభ్యర్థులు ఖర్చు చేసిన వివరాలు ట్యాలీ కావాలన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా కోఆపరేటివ్‌ అధికారి ఇందిరా, సంబంధిత అధికారులు పాల్గొన్నారు. 

మరిన్ని వార్తలు