విన్నారు.. వెళ్లారు..

13 Mar, 2015 00:45 IST|Sakshi

విద్యుత్ చార్జీల పెంపుపై వైఖరి వెల్లడించని ఈఆర్‌సీ
పలు సమస్యలపై గళమెత్తిన వినియోగదారులు, సంఘాల నేతలు
 

హన్మకొండ : తెలంగాణ రాష్ట్ర విద్యుత్ రెగ్యులేటరీ కమిషన్ చైర్మన్, సభ్యులు విద్యుత్ వినియోగదారుల వాదనలు విన్నారు.. వారి వైఖరి, తీసుకోబోయే చర్యల గురించి మాట మాత్రమైన చెప్పకుండానే వెళ్లారు.  విద్యుత్ చార్జీల పెంపు, టీఎస్ ఎన్పీడీసీఎల్ విద్యుత్ అవసరాలు, ఆదాయం, వ్యయం, వినియోగదారుల సమస్యలపై హన్మకొండలోని జిల్లా ప్రజాపరిషత్ సమావేశ హాల్‌లో తెలంగాణ రాష్ట్ర విద్యుత్ రెగ్యులేటరీ కమిషన్ చైర్మన్ ఇస్తామయిల్ అలీఖాన్, సభ్యులు శ్రీనివాస్, మనోహర్‌రెడ్డితో కూడిన బెంచ్ గురువారం బహిరంగ విచారణ జరిపింది. అరుుతే... ఈఆర్‌సీ చార్జీల పెంపుపై ఎలాంటి ప్రకటన చేయలేదు. దీంతో ఎన్పీడీసీఎల్ సీఎండీ ప్రతిపాదించిన ట్లు విద్యుత్ వినియోగదారులపై భారం మోప డం ఖాయంగా కనపడుతోంది. ముందుగా ఎన్పీడీసీఎల్ పరిధిలోఎంత విద్యుత్ వినియో గం అవసరం, నిర్వహణ, ఆదాయ, వ్యయా లు, విద్యుత్ చార్జీల పెంపు ప్రతిపాదనలను ఎన్పీడీసీఎల్ సీఎండీ వెంకటనారాయణ  వివరించారు. అనంతరం విద్యుత్ వినియోగదారుల నుంచి అభిప్రాయాలు స్వీకరించారు.

కెపాసిటర్ల ఏర్పాటులో స్కాం జరిగింది...

విద్యుత్ ఎవరి సొత్తు కాదని, అందరికి సమానంగా అందాలని భారతీయ కిసాన్ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు బి.రాము అన్నారు. వ్యాపార ప్రకటనలకు పీక్ సమయంలో విద్యుత్‌ను నిలిపివేయాలన్నారు.. వ్యాపార సంస్థలకు తక్కువ మొత్తలో చార్జీలు పెంచి గృహ వినియోగదారులకు ఎక్కువ శాతం పెంచడం తగదు. వ్యవసాయదారుల నుంచి సర్వీస్ చార్జి వసూలు చేస్తూ ఉచితంగా విద్యుత్ ఇస్తున్నామంటూ అవమానపరుస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఎన్పీడీసీఎల్ ఉద్యోగులు భారీ గా జీతాలు తీసుకుంటూనే రైతులను పీడిస్తూ లంచాలు వసూలు చేస్తున్నారని మండిప డ్డారు. సర్వీస్ చార్జీలు సంవత్సరానికి రూ. 360వసూలు చేయాలి.. కానీ, రూ.600 వసూ లు చేసి రశీదు ఇచ్చారని చెప్పారు. ఇది అసలుదా.. నకిలీదా అని ప్రశ్నించారు. కెపాసిటర్ల ఏర్పాటులో స్కాం జరిగింది.. సీజీఎఫ్ చైర్మన్ గా కంపెనీ అధికారిని కాకుండా రిటైర్డ్ న్యాయమూర్తిని నియమించాలని డిమాండ్ చేశారు.

లంచం ఇచ్చినా..

విద్యుత్ అధికారులు, ఉద్యోగుల్లో అవినీతి పెచ్చరిల్లిందని భారతీయ కిసాన్ సంఘం నిజామాబాద్ జిల్లా నాయకుడు ఇంజిరెడ్డి అన్నారు. ఓ రైతు రూ.10 వేలు లంచమిచ్చినా ట్రాన్స్‌ఫార్మర్ బిగించలేదని వివరించారు.
 
నిర్వహణ ఖర్చులు తగ్గిస్తే సరిపోతుంది

నిర్వహణ ఖర్చులు తగ్గిస్తే బిల్లులు పెంచే అవసరముండదని వినియోగదారుల మండలి జిల్లా ప్రతినిధి  చక్రపాణి సూచించారు. అధికారులు, ఈఆర్‌సీ ఈ దిశగా ఆలోచించాలన్నా రు. రాత్రి కరెంట్‌తో రైతులు చనిపోతున్నారని, ఇప్పటికైనా వ్యవసాయానికి పగలు కరెంట్ ఇవ్వాలని డిమాండ్ చేశారు. అన్యా యం జరిగిందని ఫోరానికి వెళితే 3 నెలలు పడుతోందని, ఫోరం నిర్ణయం వెలువడకముందే కనెక్షన్ తొలగిస్తున్నారని వివరించారు.  

వర్కర్‌ను కేటారుుంచాలి

వినియోగదారులకు అవగాహన కల్పించేం దుకు కనీసం కరపత్రాలు కూడా ముద్రించడం లేదని విద్యుత్‌వినియోగదారుల పరిష్కార వేదిక సభ్యుడు సాయిరెడ్డి అన్నారు. రూ. లక్షల్లో బకాయిల్లో ఉన్న ప్రభుత్వ కార్యాలయాలకు పైసా అపరాధ రుసుం విధించని ఎన్పీడీసీఎల్  మామూలు వినియోగదారులు ఒక్క రూపాయి బకాయి ఉన్న  రూ.75 అపరాధ రుసుం వసూలు చేస్తున్నారని మండిపడ్డారు. గ్రామాల్లో ట్రాన్స్‌ఫార్మర్ల మెయింటెనెన్స్‌కు వర్కర్‌ను నియమించాలని డిమాండ్ చేశారు.
 
చార్జీల పెంపును విరమించుకోవాలి..

ఖమ్మం జిల్లాలో 500 గ్రానైట్ పరిశ్రమలుం డగా 300 మూతపడ్డారుు... మరో వంద పరిశ్రమలు మూతపడే పరిస్థితులో ఉన్నాయని, ఖ మ్మం గ్రానైట్ అసోసియేషన్ అధ్యక్షుడు సాధు రాజేష్ వివరించారు. పరిశ్రమలపై భారం మోపద్దని కోరారు.
 
చార్జీల భారం మోపద్దు..

హెచ్‌టీ వినియోగదారులపై అధిక చార్జీల భారం మోపుతున్నారని తెలంగాణ కాటన్ ట్రే డర్స్, మిల్లర్స్ అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షుడు రవీందర్‌రెడ్డి అన్నారు.  పరిశ్రమలు న ష్టా ల్లో ఉన్నారయని, చార్జీల భారం వేయొద్దని సూచిం చారు. చిరు వ్యాపారులకు గృహ కనెక్షన్లు ఇవ్వాలని కరీంనగర్ చాంబర్ ఆఫ్ కామర్స్ అధ్యక్షుడు అంజయ్య కోరారు. చివరకు సీఎండీ  మాట్లాడుతూ తమదృష్టికి తీసుకొచ్చి న లోపాలు సవరించుకుంటామని, అవినీతికి ఆస్కారం లేకుం డా చర్యలు తీసుకుంటామని చెప్పి సమావే శాన్ని ముగించారు. విచారణలో మాజీ జెడ్పీటీసీ సభ్యుడు ఘంటా నరేందర్‌రెడ్డి, పలు సంఘాల నేతలు,  ఎన్పీడీసీఎల్ అధికారులు పాల్గొన్నారు.
 

మరిన్ని వార్తలు