విద్యుత్ కొనుగోలు టెండర్లు వాయిదా

13 Nov, 2014 02:16 IST|Sakshi
విద్యుత్ కొనుగోలు టెండర్లు వాయిదా

* డిసెంబర్ 3 వరకు గడువు పొడిగింపు
* ఇంధనశాఖ నిబంధనలే అడ్డు
* వెసులుబాటు కోరిన టీఎస్‌ఎస్‌పీడీసీఎల్
* 74 పైసల తేడాతో కంపెనీల బిడ్

సాక్షి, హైదరాబాద్: విద్యుత్ కొనుగోలు టెండర్లు వాయిదాపడ్డాయి. తెలంగాణ విద్యుత్ సంస్థ ప్రకటించిన షెడ్యూలు ప్రకారం కంపెనీలు బిడ్ దాఖలు చేసే గడువు బుధవారంతో ముగిసింది. వచ్చేనెల 3 వరకు ఈ గడువును పొడిగించినట్లు టీఎస్‌ఎస్‌పీడీసీఎల్ వెల్లడించింది. రాష్ట్రంలో విద్యుత్ కొరత దృష్ట్యా ప్రైవేటు థర్మల్ విద్యుత్ ప్లాంట్ల నుంచి 2 వేల మెగావాట్ల విద్యుత్ కొనుగోలుకు గతనెలలో ప్రభుత్వం దీర్ఘకాలిక టెండర్లు పిలిచింది.

డిజైన్, బిల్ట్, ఫైనాన్స్, ఓన్ అండ్ ఆపరేట్ (డీబీఎఫ్‌ఓఓ) పద్ధతిలో తెలంగాణ డిస్కమ్‌లకు విద్యుత్ సరఫరా చేసేందుకు ముం దుకొచ్చే కంపెనీలను ఆహ్వానించింది. 2016 అక్టోబర్ నుంచి ఏడేళ్ల పాటు ఆ కంపెనీల నుంచి విద్యుత్ కొనుగోలు ఒప్పందాలకు సిద్ధపడింది. టెండర్ల ప్రక్రియలో దీర్ఘకాల విద్యుత్ కొనుగోలుకు కేంద్ర ఇంధన శాఖ నిర్దేశించిన బిడ్డింగ్ విధానాలు, అర్హత మార్గదర్శకాలను ఎస్‌పీడీసీఎల్ పాటించటంతో కొత్త చిక్కులు తలెత్తాయి. ఇప్పటికే కొన్ని కంపెనీలు ఈ విషయాన్ని ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లినట్లు తెలిసింది.

ఏడేళ్ల విద్యుత్ కొనుగోలు ఒప్పందం దీర్ఘకాలికం పరిధిలోనికి రాదని.. 12ఏళ్ల పాటు జరిగే ఒప్పం దాలు మాత్రమే దీర్ఘకాలికంగా పరిగణించాలని గతేడాది  కేంద్ర ఇంధనశాఖ మార్గదర్శకాలు నిర్దేశించాయి. సెంట్రల్ ఎలక్ట్రిసిటీ రెగ్యులేటరీ కమిషన్ మార్గదర్శకాల ప్రకారం దీర్ఘకాలిక విద్యుదుత్పత్తి.. సరఫరా చేసే కంపెనీలక  కనీస ప్రారంభ గడువు 48నెలలు ఇవ్వాల్సి ఉంటుంది. కానీ తెలంగాణ ప్రభుత్వం  కేవలం 24 నెలల వ్యవధిలో సరఫరా చేయాలని నిబంధన విధిం చింది. దీనిపై పలు కంపెనీలు అభ్యంతరం తెలిపినట్లు సమాచారం.

మరోవైపు ఏడేళ్లకు మించి విద్యుత్ కొనుగోలు చేయాల్సినంత అవసరం ఉండదని, అప్పటివరకు రాష్ట్రంలో కొత్తగా తలపెట్టే థర్మల్, సోలార్ ప్లాంట్లు అందుబాటులోకి వస్తాయని ఎస్‌పీడీసీఎల్ అధికారులు ఆశాభావంతో ఉన్నారు. అందుకే.. ఏడేళ్ల కొనుగోలు ఒప్పందాలను ‘ఎబోవ్ మీడియం టర్మ్’గా పరిగణించి అనుమతించాలని  కేంద్ర ఇంధన శాఖకు లేఖ రాసినట్లు సమాచారం. ఈ కారణంతోనే టెండర్లు వాయిదా పడ్డట్లు తెలుస్తోంది.

సోలార్ పవర్‌కు భారీ స్పందన..
సోలార్ విద్యుత్ కొనుగోలు టెండర్లకు ప్రైవేటు కంపెనీల నుంచి భారీస్పందన వచ్చింది. కేవ లం 74పైసల తేడాతో.. ప్రైస్ బిడ్‌ను దక్కిం చుకునేందుకు ప్రైవేటు కంపెనీలు పోటీ పడ్డాయి. 500 మెగావాట్ల సౌర విద్యుత్ కొనుగోలుకు టీఎస్‌పీడీసీఎల్ గతనెలలోనే టెండర్లు పిలి చింది. మొత్తం 108కంపెనీలు బిడ్లు దాఖలు చేశాయి. వీటన్నింటికీ 1,840 మెగావాట్ల సౌర విద్యుత్ సమకూర్చే సామర్థ్యం ఉండటంతో.. ప్రైస్ బిడ్‌కు పోటాపోటీ తప్పలేదు. సోమవారం తెరిచిన టెండర్లలో ఒక కంపెనీ కనిష్టంగా రూ. 6.45 కు ఒక యూనిట్ సౌర విద్యుత్ సరఫరాకు ముందుకొచ్చింది.

మొత్తం దాఖలైన బిడ్లలో మరో కంపెనీ గరిష్టంగా రూ.7.19 రేటు కోట్ చేసిందని అధికారులు వెల్లడించారు. రెండు మె గా వాట్ల నుంచి 200 మెగావాట్ల సోలార్ విద్యుత్‌ను అందించేందుకు సిద్ధంగా ఉన్న కంపెనీలు టెండర్లలో పాల్గొన్నాయి. అత్యల్పంగా కోట్ చేసి న కంపెనీ 50 మెగావాట్ల విద్యుత్ సరఫరాకు ముందుకొచ్చింది. ఒక్క కంపెనీ మాత్రమే 200 మెగావాట్లు సరఫరాచేసేందుకు టెండర్ వేసిం ది. దీంతో ఎన్ని కంపెనీలతో ఒప్పందం చేసుకోవాలి, సగటున ఎంతరేటు నిర్ణయించాలి, ఎంత విద్యుత్ సమకూర్చుకోవాలన్న అంశంపై టీఎస్‌ఎస్‌పీడీసీఎల్ అధికారులు కసరత్తు చేస్తున్నారు.

>
మరిన్ని వార్తలు