విద్యుత్‌ కార్యాలయంలో భారీ చోరీ

30 Apr, 2018 05:16 IST|Sakshi
వేలిముద్రలు సేకరిస్తున్న క్లూస్‌ టీమ్‌

గేటు తాళం, లాకర్‌ పగలగొట్టి రూ.13 లక్షలు అపహరణ

తూప్రాన్‌: డివిజన్‌ కేంద్రంలోని పోతరాజ్‌పల్లి సమీపంలో రహదారి పక్కన ఉన్న విద్యుత్‌ డీఈ కార్యాలయంలో శనివారం రాత్రి భారీ చోరీ జరిగింది. తూప్రాన్‌ డీఎస్పీ రామ్‌గోపాల్‌రావు, విద్యుత్‌ డీఈ సుభాష్‌ తెలిపిన వివరాల ప్రకారం.. డివిజన్‌ పరిధిలోని గ్రామాల్లో వసూలు చేసిన కరెంట్‌ బిల్లుల నగదు రూ.16.39 లక్షలను రెండు బ్యాగుల్లో ఉంచి కార్యాలయంలోని లాకర్‌లో శనివారం రాత్రి భద్రపరిచారు.

కార్యాలయం ప్రధాన గేటు తాళాన్ని, లాకర్లను దొంగలు గుణపం సహాయంతో పగలగొట్టి నగదును దోచుకెళ్లారు. కార్యాలయంలోని పై అంతస్తులో నిద్రిస్తున్న సిబ్బంది ఈ విషయాన్ని ఆదివారం ఉదయం గుర్తించి, సంబంధిత అధికారులకు సమాచారం అందించారు. దీంతో ఘటన స్థలానికి చేరుకున్న అధికారులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. నిందితుల వేలిముద్రలను క్లూస్‌ టీమ్‌ సేకరించినట్లు డీఎస్పీ రామ్‌గోపాల్‌రావు తెలిపారు.

మరిన్ని వార్తలు