బాలల బంధువు

5 Feb, 2016 02:29 IST|Sakshi

బాలకార్మిక వ్యవస్థ నిర్మూలనకు ‘ఆపరేషన్ స్మైల్’
ఇప్పటికి 752 మంది పిల్లలకు విముక్తి
పనిలో పెట్టుకున్న యజమానులకు జరిమానా
{పత్యేక బృందాలతో జిల్లా వ్యాప్తంగా దాడులు
ఇంకా పనుల్లో మగ్గుతున్న బాలలెందరో..

 
ఆపరేషన్  స్మైల్ కింద 2015 జనవరి 1 నుంచి 31 వ రకు 283 మంది బాలలను, జూలై 1 నుంచి 31 వరకు 160 మందిని  
 చేరదీశారు. అదేవిధంగా 2016 జనవరి 1 నుంచి 31 వరకు 309 మంది పిల్లలకు పని నుంచి విముక్తి కల్పించారు.పిల్లలను పనిలోపెట్టుకున్న యజమానులకు 2015 జనవరి 1 నుంచి 31 వరకు రూ.5.58 లక్షలు, జూలై 1 నుంచి 31 వరకు రూ.4 లక్షలు జరిమానా విధించారు.
 
వరంగల్ నగర పోలీస్ కమిషనర్ సుధీర్‌బాబు ఆప్యాయంగా పలకరిస్తున్న ఈ చిత్రంలోని పిల్లలు బాలకార్మికులు. నగర శివారులోని ఏనుమాముల, పైడిపల్లి ప్రాంతాల్లోని ఇటుక బట్టీల్లో కొందరు బాలకార్మికులు పనిచేస్తున్నారని పోలీస్ కమిషనర్‌కు జనవరి 29న సమాచారం అందింది. ఈ మేరకు ‘ఆపరేషన్  స్మైల్’లో భాగంగా ఆయన వెంటనే హ్యూమన్ ట్రాఫికింగ్ విభాగం పోలీసు బృందాన్ని అలర్ట్ చేశారు. దీంతో వారు పైడిపల్లి, ఏనుమాములలోని ఇటుక బట్టీల వద్ద ఏకకాలంలో దాడులు నిర్వహించగా 48 మంది చిన్నారులు పని చేస్తూ కనిపించారు.  ఆ బాలలను వరంగల్‌లోని చైల్డ్‌హోంకు తరలించారు. అన ంతరం చైల్డ్ వెల్ఫేర్ కమిటీ (సీడబ్ల్యూసీ) ఆధ్వర్యంలో ఇటుక బట్టి యజమానికి నోటీసులు జారీ చేశారు. ఈ బాలలంతా ఇతర రాష్ట్రాలకు చెందిన వారు కావడంతో వారిని స్వస్థలాలకు పంపించారు.

>
మరిన్ని వార్తలు