ఏడు శాఖల్లో ఉద్యోగుల విభజన పూర్తి

20 Feb, 2015 03:44 IST|Sakshi

సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర ప్రభుత్వ పరిధిలోని ఏడు శాఖల ఉద్యోగుల విభజన పూర్తయింది. డెరైక్డర్ ఆఫ్ ప్రాసిక్యూషన్స్, కమిషనర్ ఆఫ్ మైనారిటీ వెల్ఫేర్, కమిషనరేట్ ఆఫ్ హాండ్లూమ్స్ అండ్ టెక్స్‌టైల్స్, కమిషనరేట్ ఆఫ్ సెరీ కల్చర్, డెరైక్టరేట్ ఆఫ్ ఎలక్ట్రానిక్ డెలివరీ సర్వీసెస్, కామర్స్ అండ్ ఎక్స్‌పోర్ట్స్ ప్రమోషన్స్ శాఖల్లో విభజన పూర్తయిందని ఆర్థికశాఖ ప్రత్యేక కార్యదర్శి రామకృష్ణారావు తెలిపారు.  మొత్తం244 మంది ఉద్యోగుల్లో తెలంగాణకు 104, ఆంధ్రకు 140 మందిని కేటాయించారని ఆయన అన్నారు. ఇంకా 45 శాఖల విభజన జరగాల్సి ఉందని, ఆప్షన్ల కోసం ఆయా శాఖల ఉద్యోగులకు 15 రోజుల సమయం ఇచ్చామన్నారు. అన్ని శాఖల విభజనకు మరో నెల రోజుల సమయం పడుతుందన్నారు.
 

>
మరిన్ని వార్తలు