సీపీఎస్‌ విధానం దుర్మార్గపు చర్య

2 Sep, 2017 08:30 IST|Sakshi
సీపీఎస్‌ విధానం దుర్మార్గపు చర్య

 ఉద్యోగ సంఘాల నేతల మండిపాటు
  రద్దు చేసే వరకు ఉద్యమం ఆపేది లేదని స్పష్టం
సాక్షి, హైదరాబాద్‌:
కాంట్రిబ్యూటరీ పెన్షన్‌ స్కీం (సీపీఎస్‌) విధానాన్ని రద్దు చేసి పాత పెన్షన్‌ విధానం కొనసాగించాలని సచివాలయ ఉద్యోగ సంఘం నేతలు, ఉద్యోగులు డిమాండ్‌ చేశారు. సామూహిక సెలవు, నల్ల బ్యాడ్జీలతో నిరసన తెలపాలని ఉద్యోగ సంఘాలు ఇచ్చిన పిలుపు మేరకు శుక్రవారం సచివాలయ ఉద్యోగులు నల్ల బ్యాడ్జీలతో సచివాలయం ‘డి’బ్లాక్‌ నుంచి ‘సి’బ్లాక్‌ వరకు నిరసన తెలిపారు. సీపీఎస్‌ను కేంద్రం రద్దు చేసి పాతపెన్షన్‌ విధానాన్ని పునరుద్ధరించే దాకా ఉద్యమం ఆపేదిలేదని స్పష్టం చేశారు. 2004 నుంచి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు నేషనల్‌ స్కీం పేరుతో పెట్టిన సీపీఎస్‌ విధానం దుర్మార్గపు చర్య అని మండిపడ్డారు.

సీపీఎస్‌ వల్ల ఉద్యోగ కుటుంబాలకు జీవిత భద్రత లేకుండా పోతుందన్నారు. ఇప్పటికీ కొన్ని రాష్ట్రాల్లో పాత పెన్షన్‌ విధానమే అమలవుతుందని గుర్తు చేశారు. ఉమ్మడి ఏపీ అందరికంటే ముందు ఏకపక్షంగా సీపీఎస్‌ విధానాన్ని అమల్లోకి తెచ్చి ఉద్యోగు లకు అన్యాయం చేసిందని ఆరోపించారు. దీనిపై 14 ఏళ్లుగా ఉద్యోగులు ఆందోళన చేస్తున్నా ప్రభుత్వాలు పట్టించుకోకపోవడం దారుణమ న్నారు. నిరసన కార్యక్రమంలో తెలంగాణ సచివాలయం సంఘం ప్రధాన కార్యదర్శి యూసుబ్‌ మియా, కోశాధికారి ఆర్‌ . రాజేశ్, ఉపాధ్యక్షులు మంగమ్మ, లింగమూర్తి, రాజే శ్వర్‌రెడ్డి , కార్యదర్శులు రమేశ్, నవీన్‌కుమార్‌ తదితరులు పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు