‘స్థానికులకే ఉపాధి కల్పించాలి’

30 Jan, 2018 16:49 IST|Sakshi
మాట్లాడుతున్న పులికుంట గ్రామస్తులు

రెబ్బెన : సింగరేణి యాజమాన్యం పులికుంట గ్రామానికి సమీపంలో నూతనంగా నిర్మించిన సీహెచ్‌పీలో పులికుంట గిరిజనులకు, యువకులకు ఉపాధి కల్పించాలని నంబాల ఎంపీటీసీ కొవ్వూరి శ్రీనివాస్, పులికుంట గ్రామస్తులు కోరారు. సోమవారం గోలేటిటౌన్‌షిప్‌లోని జీఎం కార్యాలయంలో వినతిపత్రం అందచేశారు. అనంతరం వారు మాట్లాడుతూ పులికుంట గ్రామానికి అతి సమీపంలో సీహెచ్‌పీని నిర్మించడం వల్ల దాని నుంచి వెలువడే దుమ్మూ, దూళితో గ్రామం నాషనం కానుందని ఆవేదన వ్యక్తం చేశారు. గ్రామంలోని గిరిజనులంతా వ్యవసాయంపై ఆధారపడి జీవించే ౖరైతులు, కూలీల కుటుంబాలు ఉన్నాయన్నారు. అయినప్పటికీ గ్రామస్తులు సీహెచ్‌పీ నిర్మాణానికి సహకరించారని పేర్కొన్నారు. సీహెచ్‌పీతో తీవ్రంగా ప్రభావానికి గురయ్యే పులికుంటను సింగరేణి యాజమాన్యం పునరావాస గ్రామంగా గుర్తించి గ్రామంలో అన్ని రకాల మౌలిక వసతులు కల్పించాలని డిమాండ్‌ చేశారు. ఆదివాసీ కోలావార్‌ మండల అధ్యక్షుడు మైలారం శ్రీనివాస్, గ్రామపెద్దలు ఎర్గటి పోచయ్య, మారయ్య, భీమేశ్, అశోక్, పోశం తదితరులు పాల్గొన్నారు. 

 

మరిన్ని వార్తలు