తెలంగాణలో పెట్టుబడులకు ప్రోత్సాహం

24 Apr, 2015 02:11 IST|Sakshi
తెలంగాణలో పెట్టుబడులకు ప్రోత్సాహం

అమెరికాలో పారిశ్రామిక, విద్యావేత్తలతో ఎంపీ కవిత

రాయికల్: అమెరికాలోని పారిశ్రామికవేత్తలు తెలంగాణలో పెట్టుబడులు పెట్టడానికి ఆసక్తి చూపాలని నిజామాబాద్ ఎంపీ కల్వకుంట్ల కవిత కోరారు. అమెరికా పర్యటనలో ఉన్న ఆమె గురువారం ప్రఖ్యాత 1871 వాణిజ్య కేంద్రాన్ని సందర్శించారు. ఔత్సాహిక పారిశ్రామికవేత్తలు, నూతన వ్యాపారాలను ప్రోత్సహించేందుకు ఏర్పాటు చేసిన ఎంటర్‌ప్రెన్యూర్ ఇంక్యుబేషన్ సెంటర్‌ను సందర్శించారు. పారిశ్రామికవేత్తలతో మాట్లాడుతూ ఈ సెంటర్‌లో ఫార్చూన్ 500 కంపెనీలతోపాటు 2వేల మంది పారిశ్రామికవేత్తలు భాగంగా ఉన్నారని, ఇలాంటి సెంటర్ ఒకటి తెలంగాణలో ఏర్పాటు చేయాల్సిందిగా 1871 కేంద్ర సీఈవో హోవర్డ్ తుల్‌మాన్, కో-ఆర్డినేటర్ లక్ష్మీసింగ్‌ను కోరారు. దీనిపై సీఈవో సానుకూలంగా స్పందించి హైదరాబాద్‌లో పెట్టుబడులు పెట్టడానికి త్వరలోనే వస్తామని కవితతో చెప్పినట్లు అక్కడి టీఆర్‌ఎస్ ఎన్నారై సెల్ నాయకులు ‘సాక్షి’కి తెలిపారు.

ఇదివరకే చికాగో స్టేట్ యూనివర్సిటీ అధికారులతో సంప్రదింపులు జరి పిన కవిత తెలంగాణ యూనివర్సిటీ తర ఫున సంతకం చేశారు. చికాగో స్టేట్ యూని వర్సిటీ, తెలంగాణ యూనివర్సిటీ మధ్య ఒప్పందంతో రెండు యూనివర్సిటీల మేథోవనరులను, విద్యార్థులను మార్పిడి చేసుకునే అవకాశం ఉంటుంది. ప్రధానంగా కంప్యూటర్ సైన్స్, ఎడ్యుకేషన్ డిపార్ట్‌మెంట్‌లో ఈ ఒప్పందం ఎంతో ఉపయోగకరంగా ఉంటుంది. దీనిలో భాగంగా రెండు యూనివర్సిటీల విద్యార్థులు, ప్రొఫెసర్లు, బోధనా పద్ధతులు, పరిశోధనలను మార్చుకోవచ్చు. ఈ ఒప్పందంలో తెలంగాణ యూనివర్సిటీ తరఫున ఎంపీ కవితతోపాటు యూనివర్సిటీ ప్రెసిడెంట్ డాక్టర్ వాట్సన్, వైస్ ప్రెసిడెంట్ దేవ్ ఖలీఫ్ తదితరులు పాల్గొని సంతకాలు చేశారు.
 

మరిన్ని వార్తలు