ఏదీ.. నాటి వైభవం!

21 Dec, 2014 02:22 IST|Sakshi
ఏదీ.. నాటి వైభవం!

ఒకనాడు చెరుకు రైతులను ప్రోత్సహించి, చెరుకు సాగు పెంపుదల కోసం కృషి చేసిన ‘చెరుకు అభివృద్ధి మండళ్లు’ ప్రస్తుతం  నిస్సహా య స్థితిలో కొట్టుమిట్టాడుతున్నా యి. సర్కారు అండ కరువై అలంకారప్రాయంగా మిగిలాయి. ఘన చరిత్ర కలిగిన సీడీసీలు నిధులు లేక, ఆదాయ వనరులు పడిపోయి నిర్వీర్యంగా దర్శనమిస్తున్నాయి.
 
* అలంకారప్రాయంగా మారిన సీడీసీలు
* పడిపోయిన ఆదాయ వనరులు
* చెరుకు రైతుకు ప్రోత్సాహం కరువు  
* తెలంగాణ సర్కారుపైనే ఇక ఆశలు

బోధన్: చక్కెర పరిశ్రమలు ప్రభుత్వ రంగ సంస్థలో ఉండగా చెరుకు అభివృద్ధి మండళ్లకు (సీడీసీలు) పుష్కలంగా ఆదాయం ఉండేది. ఎందుకంటే, అపుడు చెరు కు క్రషింగ్ గణనీయంగా సాగేది. ఉమ్మడి రాష్ట్రంలో చక్కెర కర్మాగారాలు ప్రయివేట్ సంస్థల గుప్పిట్లోకి వెళ్లడం, చెరుకు సాగు భారీగా తగ్గిపోవడంతో ఆదా యం పడిపోయింది. ప్రయివేటు యాజమాన్యాలు రైతుల సంక్షేమాన్ని పట్టించుకోవడం లేదు. తెలంగాణ సర్కారయినా సీడీసీలకు మళ్లీ జీవం పోస్తే మేలు జరుగుతోందని రైతులు ఆశిస్తున్నారు.
 
నామమాత్రపు సేవలు
గతంలో చెరుకు సాగు విస్తీర్ణం పెంచేందుకు సీడీసీలు రైతులకు రాయితీపై పురుగు మందులు, ఎరువులు, సాగు నీటి సరఫరాకు పైపులు అందించేవి. చెరుకు రవాణాకోసం రహదారులు కూడా నిర్మించేవి. ప్రస్తు తం ఈ సేవలు అంతంత మాత్రంగానే కొనసాగుతున్నాయి. బోధన్ అసిస్టెంట్ కేన్ కమిషనర్ కార్యాలయ పరిధిలో నిజామాబాద్, కరీంనగర్, ఆదిలాబాద్ జిల్లాలు ఉంటాయి. ఆదిలాబాద్ జిల్లాలో చెరుకు ఫ్యాక్టరీలు లేనందున అక్కడ సీడీసీలు ఏర్పాటు కాలే దు. నిజామాబాద్ జిల్లాలో బోధన్, కామారెడ్డి,పిట్లం, నిజామాబాద్, కరీంనగర్ జిల్లా మెట్‌పల్లిలో సీడీసీలున్నాయి.

ఇందులో నిజామాబాద్ సీడీసీ మూతపడిం ది. కామారెడ్డి, పిట్లం సీడీసీల ద్వారా కొంత మేరకు సేవలందిస్తున్నారు. చెరుకు క్రషింగ్ పైనే సీడీసీలకు ఆదాయం వస్తుంది. క్రషింగ్ అయిన ప్రతి టన్నుకు ఎనిమిది రూపాయల చొప్పున యాజమాన్యాలు సీడీసీలకు చెల్లించాలి. రైతుల బిల్లుల నుంచి మరో నాలు  గు రూపాయలు వస్తాయి. ప్రభుత్వ నిధులేమీ ఉండ వు. చెరుకు సాగు క్రమంగా పడిపోయి, సీడీసీలకు ఆదాయం తగ్గిపోయింది.
 
రాజకీయ పునరావాస కేంద్రాలు
ప్రభుత్వాలు సీడీసీ చైర్మన్, డెరైక్టర్లను నామినేటెడ్ పద్ధతిలో నియమిస్తున్నాయి. దీంతో అవి రాజకీయ నాయకులకు పునరావాస కేంద్రాలుగా మారాయనే విమర్శలు వినిపిస్తున్నా యి. ఆసియా ఖండంలోనే అతి పెద్ద వ్యవసాయాధార పరిశ్రమగా పేరుపొందిన బోధన్ నిజాం షుగర్ ఫ్యాక్టరీ ప్రభుత్వ రంగ సంస్థల పరిధిలో ఉండగా, 1990 వరకు ప్రతి సీజన్‌లో ఐదు లక్షల టన్నుల వరకు చెరుకు క్రషింగ్ అయ్యేది. ఇక్కడ 1962లో సీడీసీని ఏర్పాటు చేశారు. అప్పట్లో పుష్కలంగా ఆదాయం సమకూ రింది. 2002లో ఈ ఫ్యాక్టరీని ప్రయివేటీకరించారు. అప్పటి నుంచి 2013-14 సీజన్ వరకు ఇక్కడ రెండు లక్షల టన్నులకు పైగా మాత్రమే క్రషింగ్ జరిగింది. ఫలితంగా సీడీసీకి ఆదాయం పడిపోయింది.

ఈ ఏడాది 1.09 లక్షల టన్నుల వరకు క్రషింగ్ జరిగే అవకాశం ఉంది. మరోవైపు చెరుకును సాగు చేస్తున్న రైతులకు లాభసాటి ధర అందని ద్రాక్షగానే మిగులుతోంది. చెరుకును లాభదాయకం గా మార్చేందుకు, ఇతర రాష్ట్రాలలో అనుసరిస్తున్న సాగు పద్ధతులు, అధిక దిగుబడుల విధానాలను అధ్య యనం చేయాల్సిన అవసరం ఉంది. ఇందుకు సీడీసీలు, రైతులు, శాస్త్రవేత్తల భాగస్వామ్యం ఉండేలా చూడాలని రైతు నాయకులు కోరుతున్నారు. టీఆర్‌ఎస్ హామీ మే రకు చక్కెర ఫ్యాక్టరీలు ప్రభుత్వ పరమైతే సీడీసీలకు పూర్వ వైభవం వస్తుందని రైతులు ఆశిస్తున్నారు.
 
ప్రభుత్వానికి ప్రతిపాదనలు వెళ్లాయి
చక్కెర ఫ్యాక్టరీల పురోగతికి కోసం ప్రభుత్వం చెరుకు రైతులను ప్రోత్సహించాలి. రైతులకు ప్రత్యేక ప్యాకేజీ ఇచ్చి, లాభసాటి ధర అందే విధంగా చూస్తే సాగు గణనీ యంగా పెరిగే అవకాశం ఉం టుంది. ‘మన ఊరు-మన ప్రణాళిక’,  స్టేట్ షుగర్ ఇండస్ట్రీస్ డెవలప్‌మెంట్ విభాగం ద్వారా చక్కెర పరిశ్రమల అభివద్ధి కోసం ఉన్నతాధికారులు ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపారు. అవి పరిశీలనలో ఉన్నాయి. చెరుకు సాగు పెరిగితే సీడీసీలకు ఆదాయ వనరులు సమకూరుతాయి.
 - ఎం జాన్ విక్టర్, అసిస్టెంట్ కేన్ కమిషనర్, బోధన్

మరిన్ని వార్తలు