లాక్‌డౌన్‌ ముగియగానే టెన్త్‌ పరీక్షలు

29 Apr, 2020 01:17 IST|Sakshi

కేంద్ర మంత్రి వీడియో కాన్ఫరెన్స్‌లో వెల్లడించిన అధికారులు

సాక్షి, హైదరాబాద్‌: లాక్‌డౌన్‌ ముగియగానే రాష్ట్రంలో పదో తరగతి పరీక్షలను నిర్వహిస్తామని విద్యాశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి చిత్రా రామచంద్రన్‌ తెలిపారు. కేంద్ర మంత్రి రమేశ్‌ పోఖ్రియాల్‌ మంగళవారం వివిధ రాష్ట్రాల విద్యాశాఖ మంత్రులు, అధికారులతో పరీక్షల నిర్వహణపై వీడియో కాన్ఫరెన్స్‌ నిర్వహించారు. ఈ సందర్భంగా రాష్ట్రంలో చేపట్టిన చర్యలను చిత్రా రామచంద్రన్‌ వివరించారు.

ఇంటర్‌ పరీక్షలు పూర్తయ్యాయని, ఫలితాలను వెల్లడించాల్సి ఉందని తెలిపారు. విద్యార్థులకు ఆన్‌లైన్‌లో బోధన చేపడుతున్నామని, టీ–శాట్‌ ద్వారా, యూట్యూబ్‌ ద్వారా, దీక్ష ద్వారా ఆడియో, వీడియో పాఠాలను విద్యార్థులకు బోధిస్తున్నామని వెల్లడించారు. అలాగే ఒకటో తరగతి నుంచి పదో తరగతి వరకు పాఠ్య పుస్తకాలను క్యూఆర్‌ కోడ్‌ డిజిటలైజ్‌ చేశామని, అవి విద్యార్థులకు అందుబాటులో ఉన్నట్లు వివరించారు.

మరిన్ని వార్తలు