ఇంజనీరింగ్ సిలబస్ మారుస్తాం

20 Nov, 2014 00:55 IST|Sakshi
ఇంజనీరింగ్ సిలబస్ మారుస్తాం

పరిశ్రమల అవసరాలకు అనుగుణంగా తీర్చిదిద్దుతాం: కేటీఆర్

హైదరాబాద్: పరిశ్రమల అవసరాలకు అనుగుణంగా ఇంజనీరింగ్ సిలబ స్‌ను మారుస్తామని తెలంగాణ ఐటీ శాఖ మంత్రి కె.తారకరామారావు చెప్పారు. దీని పై రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికే కసరత్తు  చేపట్టిందని తెలిపారు. ప్రొఫెషనల్ కోర్సులు చదువుతున్న విద్యార్థులకు సాఫ్ట్ స్కిల్స్‌పై శిక్షణనివ్వడం కోసం ‘తెలంగాణ అకాడమీ ఫర్ స్కిల్స్ అండ్ నాలెడ్జ్-టాస్క్’ పేరిట కొత్త ప్రాజెక్టు చేపడుతున్నట్లు మంత్రి వెల్లడించారు. విద్యార్థులకు ఉద్యోగాలు కల్పించేందుకు విద్యాసంస్థలకు, పరిశ్రమలకు టాస్క్ ఒక వారధిగా వ్యవహరిస్తుందన్నారు.

ఐటీ పరిశ్రమకు చెందిన ప్రతినిధులతో బుధవారం హైదరాబాద్‌లోని హోటల్ తాజ్ కృష్ణాలో జరిగిన చర్చాగోష్టిలో మంత్రి కేటీఆర్ మాట్లాడారు. ‘‘రాష్ట్రంలో 300 ఇంజనీరింగ్ కాలేజీలున్నాయి. ప్రతి ఏడాది దాదాపు 70 వేల మంది విద్యార్థులు ఇంజనీరింగ్ పూర్తిచేస్తున్నారు. కానీ 20 వేల మందికే ఉద్యోగాలు వస్తున్నాయి. ప్రభుత్వంతో పాటు ఐటీ పరిశ్రమ తమ వంతు చేయూత అందిస్తే మిగతావారు సైతం వివిధ రంగాల్లో ఉద్యోగాలను సాధించే అవకాశముంది..’’ అని ఆయన పేర్కొన్నారు.
 

మరిన్ని వార్తలు