స్టార్టప్‌లతో లక్ష్యాలను చేరుకోండి 

8 Sep, 2019 14:40 IST|Sakshi
విద్యార్థులకు పట్టాలను అందిస్తున్న పురుషోత్తం

జాతీయ పరిశోధనా సంస్థ చైర్మన్, ఎండీ పురుషోత్తం 

సాక్షి, మణికొండ: యువ ఇంజినీర్లు స్టార్టప్‌లను ఏర్పాటుచేసి ఇతరుకుల ఉపాధిని చూపే స్థాయి ఎదగాలని జాతీయ పరిశోధనా సంస్థ చైర్మన్, మేనేజింగ్‌ డైరెక్టర్‌ డాక్టర్‌ పురుషోత్తం ఆకాంక్షించారు.  గండిపేటలోని సీబీఐటీ కళాశాలలో శనివారం 3వ గ్రాడ్యుయేషన్‌ దినోత్సవం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన పాల్గొని విద్యార్థులకు కళాశాల అధ్యక్షుడు డాక్టర్‌ వి.మాలకొండారెడ్డితో కలిసి పట్టాలు అందించారు. కేంద్ర ప్రభుత్వం స్టార్టప్‌లకు యేటా రూ.10వేల కోట్లను కేటాయించి ప్రోత్సహిస్తోందని తెలిపారు. క్రమశిక్షణతో జీవితంలో స్థిరపడి వచ్చిన సంపాదనలో కొంత సమాజానికి తిరిగి ఇవ్వాలని సూచించారు.

కేంద్ర ప్రభుత్వం నైపుణ్యం ఉన్నవారికి పూర్తిస్థాయిలో మద్దతు ఇస్తూ, సాంకేతిక పరిజ్ఞానాన్ని అందించటంతో పాటు ఎన్‌ఆర్‌డీసీ సహకరిస్తుందని తెలిపారు. ఇంజినీరింగ్‌ విద్యార్థుల్లో యేటా 18 నుంచి 20శాతం మంది మాత్రమే ఉపాధి పొందుతున్నారని చెప్పారు. చదువుతో పాటు సమాజంపై పరిజ్ఞానం ఉంటేనే రాణించే అవకాశం ఉందని పేర్కొన్నారు. 700మంది విద్యార్థులకు పట్టాలను అందజేశారు. కార్యక్రమంలో డెవలప్‌మెంట్, పర్చెజింగ్‌ కమిటీ చైర్‌పర్సన్‌ సంధ్యశ్రీ, ప్రిన్సిపాల్‌ డాక్టర్‌ రవీందర్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు. పట్టాలను అందుకున్న ఆనందంలో విద్యార్థులు సంబరాలు చేసుకున్నారు. 

మరిన్ని వార్తలు