ఇంగ్లిష్ మీడియం విద్యార్థులదే హవా

17 May, 2015 19:19 IST|Sakshi

హైదరాబాద్ సిటీ: పదో తరగతి పరీక్షల్లో ఇంగ్లీష్ మీడియం విద్యార్థులు అధిక ఉత్తీర్ణత సాధించారు. పరీక్షలు రాసిన మొత్తం విద్యార్థుల సరాసరితో పోల్చితే ఇంగ్లీష్ మీడియంలో ఉత్తీర్ణులైన వారి శాతం ఎక్కువగా నమోదైంది. మొత్తంగా 77.56 శాతం విద్యార్థులు ఉత్తీర్ణులు కాగా ఇంగ్లీష్ మీడియంలో మాత్రం 82.41 శాతం మంది ఉత్తీర్ణులయ్యారు. ఇక తెలుగు మీడియంలో 73.32 శాతం మంది విద్యార్థులు ఉత్తీర్ణులయ్యారు. ప్రైవేటు స్కూళ్లతోపాటు ప్రభుత్వ సక్సెస్ స్కూళ్లు, గురుకుల విద్యాలయాల్లో ఇంగ్లీష్ మీడియం ఉండటమే ఇందుకు ప్రధాన కారణం. గతేడాదితో పోల్చితే తెలుగు మీడియం కంటే ఇంగ్లీష్ మీడియం విద్యార్థుల సంఖ్య పెరిగింది.

గత ఏడాది తెలుగు మీడియం విద్యార్థులు 2,50,073 మంది పరీక్షలకు హాజరు కాగా అందులో 2,08,023 మంది (83.18 శాతం) ఉత్తీర్ణులయ్యారు. అదే ఇంగ్లీష్ మీడియంలో 2,36,998 మంది విద్యార్థులు పరీక్షలు రాయగా 2,11,723 మంది (89.34 శాతం) ఉత్తీర్ణులయ్యారు. గతేడాదితో పోల్చితే ఈసారి రెండు మాధ్యమాలలో ఉత్తీర్ణత శాతం తగ్గినా ఇంగ్లిషు మీడియంలో చేరి పరీక్షలకు హాజరైన విద్యార్థుల సంఖ్య పెరిగింది.

మీడియం వారీగా పరీక్షలకు హాజరైన ఉత్తీర్ణులైన విద్యార్థుల వివరాలు..

మీడియం           హాజరైన విద్యార్థులు         ఉత్తీర్ణులు        ఉత్తీర్ణతశాతం
తెలుగు                   2,44,448                   1,79,221        73.32
ఇంగ్లిషు                  2,56,363                    2,11,281        82.41
ఉర్దూ                         11,713                         7034        60.05
ఇతర                             949                            731        77.03
మొత్తం                   5,13,473                    3,98,267        77.56

మరిన్ని వార్తలు