'వైఎస్ షర్మిల ఫిర్యాదుపై విచారణ వేగం పెంచాం'

16 Jan, 2019 14:22 IST|Sakshi

సాక్షి, హైదరాబాద్‌ : దివంగత ముఖ్యమంత్రి వైఎస్‌ రాజశేఖరరెడ్డి కుమార్తె, ఏపీ ప్రతిపక్ష నేత వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి సోదరి వైఎస్‌ షర్మిల ఇచ్చిన ఫిర్యాదుపై సైబర్ క్రైమ్ పోలీస్ స్టేషన్‌లో విచారణ వేగం పెంచామని అదనపు డీసీపీ రఘువీర్ తెలిపారు. కొన్ని యూట్యూబ్ చానాళ్లు, ఫేస్‌బుక్ గ్రూప్‌లలో ఎక్కువగా అసభ్యకరంగా మెసేజ్‌లు పెట్టారన్నారు. సామాజిక మాధ్యమాల్లో వీడియోలు, కామెంట్లకు సంబంధించి యూఆర్ఎల్‌లపై దర్యాప్తు చేస్తున్నామని పేర్కొన్నారు.

ఇప్పటికే విచారణ కోసం స్పెషల్ టీమ్‌లను ఏర్పాటు చేశామని, యూట్యూబ్, ఫేసుబుక్ నుంచి సమాచారం రావలసి ఉందని రఘువీర్‌ తెలిపారు. వీడియోలు తయారు చేసిన వాళ్లతో పాటు దీని వెనుకాల ఉన్న వాళ్లను కూడా గుర్తించి వారిపై కూడా చర్యలు తీసుకుంటామన్నారు. గతంలో ఇచ్చిన ఫిర్యాదుపైన ముగ్గురుని అరెస్ట్ చేశామని, తాజాగా చేస్తున్న దాంట్లో వాళ్ల ప్రమేయం ఉందా అన్న కోణంలో కూడా విచారణ జరుపుతున్నామని చెప్పారు. సోషల్‌మీడియాలో తనపై దుష్ప్రచారం చేస్తున్నవారితోపాటు చేయిస్తున్న వారిపై కూడా చర్యలు తీసుకుని మహిళల ఆత్మగౌరవాన్ని కాపాడాలని కోరుతూ షర్మిల తన భర్త అనిల్‌ కుమార్‌తో కలసి సోమవారం హైదరాబాద్‌ నగర పోలీసు కమిషనర్‌ అంజనీకుమార్‌కు ఫిర్యాదు చేసిన విషయం తెలిసిందే.

మరిన్ని కథనాలు : ఎందుకింత దిగజారుడు రాజకీయాలు?

‘వైఎస్‌ జగన్‌ను ఎదుర్కొలేకే తప్పుడు ప్రచారం’

‘విష ప్రచారం టీడీపీ డీఎన్‌ఏలోనే ఉంది’

>
మరిన్ని వార్తలు