‘డబుల్ బెడ్‌రూం’ స్థలాలు గుర్తించండి

16 May, 2015 00:14 IST|Sakshi

‘ఇందిరమ్మ’ బిల్లుల కోసం విచారణ బృందాలు
మిడ్‌మానేరు నిర్వాసితులకు 4723 ఇళ్ల మంజూరు
గృహ నిర్మాణంపై ఇన్‌చార్జి కలెక్టర్ పౌసమీబసు సమీక్ష

 
 ముకరంపుర : ప్రభుత్వం నూతనంగా ప్రవేశపెట్టిన రెండు పడక గదుల నిర్మాణాల కోసం పట్టణ, గ్రామీణ ప్రాంతాలలోని ప్రభుత్వ ఖాళీస్థలాల వివరాలు శనివారంలోగా సమర్పించాలని ఇన్‌చార్జి కలెక్టర్ జేసీ పౌసమీబసు సమీక్షించారు. శుక్రవారం కలెక్టరేట్‌లో గృహనిర్మాణాలపై హౌసింగ్ పీడీ పి.నరసింహారావు, ఎగ్జిక్యూటివ్ ఇంజినీర్లు, డిప్యూటీ ఎగ్జిక్యూటివ్ ఇంజినీర్లతో సమీక్షించారు. ప్రగతిలో ఉన్న 2437 ఇళ్లకుగాను 1376 ఇళ్లు పర్యవేక్షించిన నివేదికలు అందాయని, మిగిలిన ఇళ్లను రెండు రోజుల్లోగా పర్యవేక్షించి నివేదిక ఇవ్వాలని కోరారు.

ఇళ్ల లబ్ధిదారుల జాబితా ప్రకారం నియోజకవర్గానికి ఆర్డీవో, తహశీల్దార్‌లతో కూడిన ప్రత్యేక బృందాలు విచారణ చేపట్టాలని, పరిశీలన పూర్తయిన అనంతరం లబ్ధిదారులకు బిల్లులు చెల్లింపులుంటాయని అన్నారు. జిల్లాలో ఇంకా మిగిలిన 44,789 మంది ఇళ్ల లబ్ధిదారుల రేషన్ కార్డుల వివరాలు ఈ నెల 31వతేదీలోగా సేకరించి పూర్తిచేయూలన్నారు. మంజూరైన 21,7827 ఇళ్లకుగాను 17,5927 మంది లబ్ధిదారులకు సంబంధించిన ఆధార్‌కార్డుల వివరాలు ఆన్‌లైన్‌లో అనుసంధానం చేసినట్లు చెప్పారు.

మిగిలిన 41,900 మందివి ఈనెల 31లోగా పూర్తి చేయాలన్నారు. మిడ్‌మానేరు ప్రాజెక్ట్ నిర్వాసితులకు జీవో నంబర్ 42 ద్వారా 4723 గృహాలు నూతనంగా మంజూరు చేయడం జరిగిందని, ఇందుకు సంబందించిన లబ్ధిదారులు పూర్తి వివరాలు ఆన్‌లైన్‌లో నమోదు చేసి వర్షాకాలానికి ముందే పనులు మొదలు పెట్టాలన్నారు.  శ్రీపాద ఎల్లంపల్లి ప్రాజెక్ట్ నిర్వాసితులకు రామగుండం మండలానికి సంబంధించి 816, వెల్గటూర్ మండలానికి సంబంధించి 256 గృహాల పనులు ఇప్పటివరకు ప్రారంభించకపోవడానికి గల కారణాలేంటో సంబంధిత ఆర్డీవోలను సంప్రదించి నివేదికలివ్వాలని ఆదేశించారు.

మరిన్ని వార్తలు