అడవిలోకి రానివ్వడం లేదు

19 Sep, 2019 12:11 IST|Sakshi
సారంగాపూర్‌లో ర్యాలీ నిర్వహిస్తున్న మేదరులు

మేదరుల భారీ ర్యాలీ

ఘనంగా ప్రపంచ వెదురు దినోత్సవం

వెదురు కోసం తమను అటవీ అధికారులు అడవిలోకి అనుమతించడం లేదని మేదరులు ఆవేదన వ్యక్తం చేశారు. ప్రపంచ వెదురు దినోత్సవం సందర్భంగా జిల్లాలోని అన్ని మండల కేంద్రాల్లో మేదరులు ర్యాలీలు తీశారు. వెదురు పెంపకానికి గ్రామాల్లో ప్రత్యేకంగా స్థలం కేటాయించాలని కోరుతూ కలెక్టర్‌ శరత్‌కు వినతిపత్రం ఇచ్చారు.  

సాక్షి, సారంగాపూర్‌: ప్లాస్టిక్‌ను పూర్తిగా నిషేధిస్తేనే మేదరులు బతికి బట్టకడతారని మండల మేదరులు పేర్కొన్నారు. ఈమేరకు తహసీల్దార్‌ నవీన్‌కు వినతిపత్రం ఇచ్చారు. ప్రపంచ వెదురు దినోత్సవం సందర్భంగా సారంగాపూర్‌లో మేదరులు భారీ ర్యాలీ నిర్వహించారు. వారు మాట్లాడుతూ ప్లాస్టిక్‌ వినియోగం పెరగడంతో పర్యావరణం పూర్తిగా దెబ్బతింటుందన్నారు. ప్రభుత్వం స్పందించి ప్లాస్టిక్‌పై నిషేధం విధించాలని కోరారు. ప్లాస్టిక్‌ వాడకంతో తాము ఉపాధి కోల్పోతున్నానమని, తమ వెదురు వస్తువులను కొనుగోలు చేయడంలేదని ఆవేదన వ్యక్తం చేశారు. అటవీశాఖ అధికారులు తమను అడవిలోకి అనుమతించడం లేదన్నారు.

వెదరు పెంపకాన్ని ప్రొత్సహించేందుకు ప్రతీ మండలంలో ఐదెకరాలు వెదురు పెంపకానికి అటవీశాఖకు సంబంధం లేకుండా భూమిని కేటాయించాలని కోరారు. మేదరులా ర్యాలీలో వారు ధరించిన వెదురు టోపీలు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. వెదరుతో చేసిన టోపీలు నీడతోపాటు చల్లని గాలిని ఇస్తుండడంతో పలువురు కొనేందుకు ఆసక్తి చూపారు.  ర్యాలీలో మేదరుల సంఘం మండలాధ్యక్షుడు చంద శ్రీహరి, ఉపాధ్యక్షులు బొమ్మిడి లచ్చన్న, ప్రధాన కార్యదర్శి మామిడిపెల్లి శ్రీనివాస్, కోశాధికారి బొమ్మిడి వెంకటేశ్, గౌరవ అధ్యక్షుడు లస్మయ్య, సలహాదారు చింతల చిన్నగంగరాజం, ప్రచార కార్యదర్శి వేముల లక్ష్మీరాజం, కార్యవర్గ సభ్యులు చంద మల్లేశం, పోతు నర్సయ్య, తుమ్మల రాజేశం, మామిడిపెల్లి రాజేందర్, చింతల దుబ్బరాజం పాల్గొన్నారు.  
జగిత్యాలటౌన్‌:   తమ సమస్యలు పరిష్కరించాలని కోరుతూ మేదరులు బుధవారం జిల్లాకేంద్రంలో ర్యాలీ నిర్వహించారు. అనంతరం కలెక్టర్‌ శరత్‌ను కలిసి వినతిపత్రం ఇచ్చారు. అటవీ విస్తీర్ణం తగ్గిపోతుండడంతో వెదురుబొం గులు దొరకడం లేదని, వెదురు పెంపకానికి ప్రత్యేకంగా స్థలం కేటాయించాలని కోరారు. మే దరులకు డబుల్‌బెడ్‌రూం ఇళ్లు, ప్రభుత్వ రుణా లు ఇప్పించాలని కోరారు. అటవీశాఖ సిబ్బంది వేధింపుల నుంచి రక్షించాలని కోరారు. 

Read latest Telangana News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు
సినిమా