మట్టి విగ్రహాలనే ప్రతిష్ఠించాలి

23 Aug, 2014 03:04 IST|Sakshi
మట్టి విగ్రహాలనే ప్రతిష్ఠించాలి
  •      ఇంట్లో పూజకు చిన్న వినాయక విగ్రహాలను ఉచితంగా ఇస్తాం
  •      డీజేల సంస్కృతి మనది కాదు
  •      జిల్లా కలెక్టర్ జి.కిషన్
  • హన్మకొండసిటీ : మట్టి వినాయక విగ్రహాల నే ప్రతిష్టించాలని గణపతి నవరాత్రి ఉత్సవ కమిటీలకు కలెక్టర్ జి.కిషన్ సూచించారు. మట్టి విగ్రహాలపై ప్రచారాన్ని ఉద్యమంగా చేపట్టాలని అన్నారు. శుక్రవారం హన్మకొం డ ఏకశిల పార్కులో కుడా ఆధ్వర్యంలో నిర్వహించిన మట్టి వినాయక విగ్రహాల వినియో గ ప్రోత్సాహక సదస్సులో ముఖ్యఅతిథిగా పాల్గొని మాట్లాడారు. ప్లాస్టర్ ఆఫ్ ప్యారీస్ తో తయారు చేసే విగ్రహాల్లో విషతుల్యమైన రసాయనాలు వినియోగించటం వల్ల నిమజ్జ నం అనంతరం నీటి కాలుష్యం ఏర్పడుతుం దని చెప్పారు.

    దీంతో జంతువులకు, జలచరాలకు ప్రాణాంతకంగా మారడమేకాకుండా పర్యావరణ సమతుల్యత దెబ్బతింటుందన్నారు. మట్టితో చేసిన వినాయక విగ్రహాల ను వినియోగించి పర్యావరణాన్ని రక్షించాల ని కోరారు. నిమజ్జనం రోజు డీజేల వాడకా న్ని గణపతి మండళ్లు నియంత్రించాలని, అది మనసంస్కృతి, సంప్రదాయం కాదన్నారు. భక్తితో పూజించాలని అన్నారు. నగరంలోని అన్ని అపార్ట్‌మెంట్‌లలో మట్టి వినాయక విగ్రహాలనే ప్రతిష్ఠించాలని సూచించారు.

    ఇంటిలో పూజించే చిన్న వినాయక విగ్రహాలను మట్టితో తయారు చేయించి ఉచితం గా అందజేయనున్నట్లు చెప్పారు. సేవ్ స్వచ్ఛంద సంస్థ అధ్యక్షుడు విజయరాం మా ట్లాడుతూ తమ సంస్థ ఆధ్వర్యంలో 4 అడుగుల 5 ఇంచుల ఎత్తు కలిగిన 360 మట్టి వినాయక  విగ్రహాలను తయారు చేయించి సిద్ధంగా ఉంచామని, ఒక్కో విగ్రహం ధర రూ.4,200 ఉంటుందని అన్నారు.

    వరంగల్ లో రెండు సంవత్సరాలుగా మట్టి వినాయక విగ్రహాల వినియోగాన్ని ప్రోత్సహిస్తున్నామ ని, మట్టితో విగ్రహాల తయారీపై డిసెంబర్ లో ఉచితంగా శిక్షణ ఇవ్వనున్నట్లు తెలిపా రు. విగ్రహాల తయారీని వృత్తిగా స్వీకరించి న వారు శిక్షణ ద్వారా నేర్చుకొని ఉపాధి పొందవచ్చని సూచించారు.

    శ్రీరామకృష్ణ మఠం ప్రధాన కార్యదర్శి ఆత్మచైతన్య మాట్లాడుతూ మట్టి వినాయక విగ్రహాలు కావాలనుకునే వారు రూ.వెయ్యి చెల్లించి హన్మకొండ సర్క్యూట్ గెస్ట్‌హౌస్ రోడ్డులోని శ్రీరామకృష్ణ మఠంలో బుకింగ్ చేసుకోవాల ని, మిగతా మొత్తాన్ని విగ్రహం తీసుకెళ్లే రోజు చెల్లించాలన్నారు. ఈసందర్భంగా పీసీఆర్ ఫౌండేషన్ చైర్మన్ పూర్ణచందర్‌రావు మట్టి విగ్రహాల ఆవశ్యకతపై రూపొందించి న పోస్టర్‌ను కలెక్టర్ ఆవిష్కరించారు.

    అంత కు ముందు ఏకశిల పార్కులో తయారు చేసిన మట్టి విగ్రహాలను కలెక్టర్ కిషన్ స్వయం గా పరిశీలించారు. సమావేశంలో కుడా వైస్ చైర్మన్ యాదగిరిరెడ్డి, డీఆర్‌ఓ సురేంద్రకరణ్, గణేశ్ ఉత్సవ కమిటీ కన్వీనర్ భాస్కర్‌రావు, విశ్వహిందూ పరిషత్ జిల్లా అధ్యక్షుడు జయపాల్‌రెడ్డి, ఇంటాక్ జిల్లా చైర్మన్ ప్రొఫెసర్ పాండురంగారావు, ఆర్డీఓ మాధవరా వు, కుడా పరిపాలన అధికారి అజిత్‌రెడ్డి, ఈఈ భీంరావు తదితరులు పాల్గొన్నారు.
     

మరిన్ని వార్తలు