అభివృద్ధికి పెద్దపీట వేస్తా..

17 Jun, 2019 11:48 IST|Sakshi
ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయాన్ని ప్రారంభిస్తున్న మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు, కలెక్టర్‌ హరిత

నర్సంపేటరూరల్‌: నర్సంపేట నియోజకవర్గ అభివృద్ధికి పెద్దపీఠ వేస్తానని పంచాయతీరాజ్‌ మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు అన్నారు. నర్సంపేట పట్టణంలోని ద్వారకపేట రోడ్డులోని నూతనంగా నిర్మించిన ఎమ్మెల్యే క్యాంప్‌ కార్యాలయాన్ని ఆదివారం మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు, వరంగల్‌ రూరల్‌ జిల్లా కలెక్టర్‌ హరిత, గ్రేటర్‌ హైదరాబాద్‌ మేయర్‌ బొంతు రాంమోహన్‌లు హాజరై ప్రారంభించారు. అనంతరం ఏర్పాటు చేసిన సమావేశంలో మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు మాట్లాడుతూ 70 ఏళ్లలో ఏ ప్రభుత్వం తీసుకోని నిర్ణయం కేసీఆర్‌ ప్రభుత్వం తీసుకుని నియోజకవర్గాల్లోనే క్యాంప్‌ కార్యాలయాన్ని నిర్మించాలని నిర్ణయించారన్నారు. దీంతో అధికారులతో రివ్యూ సమావేశాలకు, ప్రజలకు ఎప్పటికీ అందుబాటులో ఉంటూ సమస్యలను పరిష్కరించేందుకు ఎంతో దోహదపడుతుందన్నారు. రాజకీయ చరిత్రలో ఎవరూ చేయలేని పని ముఖ్యమంత్రి కేసీఆర్‌ చేశారన్నారు.

నర్సంపేట నియోజకవర్గం అభివృద్ధిలో వెనకబడి ఉందని, గతంలో కమ్యూనిస్టులు పాలించినప్పుడు పోరాటాలకే పరిమితమయ్యారని, టీడీపీ, కాంగ్రెస్‌ పార్టీల పాలనలో అనుకున్న మేర అభివృద్ధి జరగలేదని, కానీ, నర్సంపేటను అన్నిరంగాల్లో అభివృద్ధి చేసేందుకు, ప్రత్యేక నిధులు కేటాయించేందుకు కృషి చేస్తానన్నారు. నర్సంపేట నియోజకవర్గంలో ప్రతిసారి ఎమ్మెల్యే ఓ పార్టీ, ఎంపీ మరోక పార్టీ, సర్పంచ్‌లు, జడ్పీటీసీలు, ఎంపీటీసీలు మరోపార్టీ గెలుస్తాయని, దీంతో అభివృద్ధి పూర్తిగా కుంటుపడేదని, ఈసారి ప్రజలంతా ముక్తకంఠంతో టీఆర్‌ఎస్‌ పార్టీని ఒక పక్షంగా గెలిపించారని, దీంతో మాకు బరువు బాధ్యతలు మరింత పెరిగాయన్నారు.

నర్సంపేటను సస్యశ్యామలం చేసేందుకు ఎక్కువ నిధులు వచ్చే విధంగా తోడ్పాడుతానన్నారు. కొత్త పంచాయతీ రాజ్‌ చట్టం తో సర్పంచ్‌కు, ఉపసర్పంచ్‌ చెక్‌పవర్‌ ఇవ్వడం జరుగుతుందన్నారు. గ్రామాల్లో సర్వాధికారులు సర్పంచ్‌కే అప్పగించడం జరుగుతుందని, నిర్లక్ష్యం వహిస్తే సర్పంచ్‌లపై చర్యలు తీసుకోవడం జరుగుతుందన్నారు. గ్రామాలను అన్ని రంగాల్లో అభివృద్ధి చేసేలా కృషి చేయాలన్నారు. కార్యక్రమంలో నర్సంపేట ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్‌రెడ్డి, నర్సంపేట మునిసిపల్‌ చైర్మన్‌ నాగెల్లి వెంకట నారాయణరెడ్డి, మునిగాల వెంకట్‌రెడ్డి, రాయిడి రవీందర్‌రెడ్డి, గోగుల రాణాప్రతాప్‌రెడ్డి, లెక్కల విద్యాసాగర్‌రెడ్డి, నాయిని నర్సయ్య, కౌన్సిలర్లు, అన్ని మండలాల ఎంపీపీ, జెడ్పీటీసీలు, సర్పంచ్‌లు, ఎంపీటీసీలు తదితరులు పాల్గొన్నారు.

Read latest Telangana News and Telugu News
Follow us on FaceBook, Twitter
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు

మున్సిపల్‌ ఎన్నికలకు ఎందుకంత హడావుడి?

గెలుపు ఓటముల్లో అతివలదే హవా..

లక్ష మందితో బహిరంగ సభ: ఎమ్మెల్యే

ఇద్దరు అంతర్రాష్ట్ర దొంగల అరెస్టు

రామయ్యా.. ఊపిరి పీల్చుకో 

బాలిక కిడ్నాప్‌ కలకలం 

మాటలు కలిపాడు..మట్టుపెట్టాడు

కాంగ్రెస్‌ సభ్యుల నిరసన; కేసీఆర్‌ స‍్పందన

మనకూ ‘ముంబై’ ముప్పు

‘కాంగ్రెస్‌ అనాథగా మారిపోయింది’

పట్నంలో అడవి దోమ!

ఆత్మహత్య చేసుకున్న ఇద్దరు యువకులు

బైకుల దొంగ అరెస్ట్‌

కేఎంసీ వర్సెస్‌ ఎంజీఎం 

'మస్ట్‌'బిన్‌ లేకుంటే జరిమానాల దరువు

కొత్తపట్నం ఏర్పాటు ఇలా..

నీళ్లు ఫుల్‌

నగరంలోకి ఎలక్ర్టికల్‌ బస్సులు

వివాహేతర సంబంధం పెట్టుకుందని..

ద.మ.రై.. వంద రైళ్ల వేగం పెంపు..

అణచి వేసేందుకే మావోయిస్టు ముద్ర

చదువుతో పాటు.. ఉద్యోగం

మత మార్పిడి చేసిన మదర్సా నిర్వాహకుల అరెస్ట్‌

ఎట్టకేలకు ఒక్కటైన ప్రేమికులు

అత్తను చంపిన కోడలు అరెస్ట్‌

వైద్యం అందక చిన్నారి మృతి

ఎడ్లబండే 108 

గుట్టుచప్పుడు కాకుండా ..

వీళ్లు ఇక మారరు..

ఇల్లు కూలుస్తుండగా పురాతన విగ్రహాలు, పూజా సామగ్రి లభ్యం

ఆంధ్రప్రదేశ్
తెలంగాణ
సినిమా

చానల్ స్టార్ట్ చేసిన మహేష్ బాబు కూతురు

లిప్ లాక్‌పై స్పందించిన విజయ్‌ దేవరకొండ

తిడతావేంటమ్మా.. నువ్వేం మారలేదు!

నమ్మకముంటే ఏదైనా సాధించవచ్చు..

‘బిగ్‌బాస్‌’ వివాదంపై స్పందించిన హేమ

'వారి కోసమే ఆ సినిమా 40సార్లు చూశాను'