వరంగల్ ఈస్ట్‌పై ఎర్రబెల్లి గురి..!

9 Sep, 2018 17:57 IST|Sakshi
ఎర్రబెల్లి ప్రదీప్‌ రావు (ఫైల్‌ ఫోటో)

వరంగల్‌ తూర్పు టికెట్‌ తనకు కేటాయించాలంటున్న ఎర్రబెల్లి ప్రదీప్‌ రావు

సాక్షి, వరంగల్‌ అర్బన్‌ : వరంగల్‌ తూర్పు నియోజకర్గ టెకెట్‌ కేసీఆర్‌ తనకు కేటాయిస్తారన్న నమ్మకముందని టీఆర్‌ఎస్‌ నేత ఎర్రబెల్లి ప్రదీప్‌ రావు ఆశాభావం వ్యక్తం చేశారు. హంటర్‌రోడ్‌లోని పార్టీ కార్యాలయంలో శనివారం ఆయన మీడియా సమావేశంలో మాట్లాడారు.. గతంలో ప్రజారాజ్యం పార్టీ నుంచి పోటీచేసి మాజీ మంత్రి బస్వరాజు సారయ్యపై స్వల్ప మెజార్టీతో ఓడియానని తెలిపారు. వరంగల్‌ తూర్పులో తనకు కార్యకర్తల బలం ఉందని.. టీఆర్‌ఎస్‌ తరుఫున పోటీచేస్తే తప్పక గెలుస్తానని ధీమా వ్యక్తం చేశారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. టీఆర్‌ఎస్‌పై తిరుగుబాటు ఎగరవేసిన కొండా దంపతులపై విమర్శల వర్షం కురిపించారు. గతంలో తనకు టికెట్‌ ఇవ్వకున్నా కేసీఆర్‌ మాట​ ప్రకారం నడుచుకుని.. కొండా సురేఖను దగ్గరుండి ఎమ్మెల్యేగా గెలిపించుకున్నామని తెలిపారు. అంతేకాకుండా తన సొంత డబ్బులు ఖర్చుపెట్టి కొండా మురళీధర్‌ రావుని ఎమ్మెల్సీగా గెలిపించామని వెల్లడించారు. వారు గెలిచిన అనంతరం మూడేళ్లపాటు పార్టీ కార్యకర్తలను, కార్పొరేటర్లను తీవ్రం వేధింపులకు గురిచేశారని అన్నారు.  చివరికి టికెట్‌ రాకపోవడంతో పార్టీపై విమర్శలు చేయడం ఏంటని ప్రశ్నించారు. వరంగల్‌ తూర్పు టికెట్‌ తనకు కేటాయించలేదని కొండా దంపతులు టీఆర్‌ఎస్‌పై బహిరంగ విమర్శలు చేసిన విషయం తెలిసిందే.

మరిన్ని వార్తలు