బాల నేరస్తులు పరార్

7 Feb, 2015 04:35 IST|Sakshi

నిజామాబాద్ క్రైం: నిజామాబాద్ జిల్లా కేంద్రం నాగారం ప్రాంతంలో గల జువైనల్ నుంచి నలుగురు బాల నేరస్తులు పారిపోయారు. ఈ ఘటనలో నిర్లక్ష్యానికి బాధ్యులైన ఇద్దరు సూపర్‌వైజర్లు సస్పెషన్‌కు గురిఅయ్యారు. ఆలస్యంగా వెలుగుచూసిన వివరాలు ఇలా ఉన్నాయి.  నాగారంలో ప్రాంతంలో గల బాలుర సంక్షేమం, సం స్కరణల సేవలు, వీధి బాలుర సంక్షేమ శాఖ ప్రభుత్వ బాలుర పరిశీలక గృహంలో వివిధ నేరాలకు పాల్పడి శిక్ష అనుభవిస్తున్న బాల నేరస్తులలో నలుగురు ఈనెల 2న పారిపోయారు.

కేంద్రంలో హెడ్ సూపర్‌వైజర్ ప్రభాకర్, సూపర్‌వైజర్ నాగవేందర్‌లు విధులు నిర్వహిస్తున్నారు. సాయంత్రం ఆరున్నర గంటల ప్రాం తంలో బ్యారక్‌లో ట్యూబ్‌లైట్ వెలగటంలేదని సూపర్‌వైజర్లు బ్యారక్ గేట్‌ను తెరిచి లోపలకు వెళ్లారు. అయితే బ్యారక్ గేట్ తెరిచేముందు బ్యారక్ గేట్ ముందున్న గేట్‌కు తాళం వేశాకే బ్యారక్ గేట్‌ను తెరుస్తారు. కాగా ఆరోజు  రెండు గేట్లు తెరిచి ఉంచి ట్యూబ్‌లైట్‌ను బాగుచేసేందుకు లోపలకు వెళ్లారు. ఇదే అదునుగా భావిం చిన ఓ బాల నేరస్తుడు బ్యారక్ నుంచి బయటకు వచ్చా డు. కొద్ది సేపయ్యాక గమనించిన సూపర్‌వైజర్లు బ్యారక్ గేట్‌లను మూసివేయకుండానే బాలుడి కోసం వెతికేందుకు బయటకు వచ్చారు.

అదే సమయంలో బ్యారక్‌లో ఉన్న మరో ముగ్గురు బాల నేరస్తులు సైతం అక్కడి నుంచి తప్పించుకు పారిపోయారు. బాలురల ను కోర్టులో హాజరు పరిచేందుకు బయటకు తీసుకెళ్తూ, తిరిగి తీసుకువచ్చే సమయంలో ప్రధాన గేట్‌కు తాళం వేయకుండా సిబ్బంది ఓ ఇనుప చువ్వను అడ్డం పెట్టేవారు. దీనిని గమనించిన బాల నేరస్తుడు గేట్‌వద్దకు పరుగెత్తుకు వచ్చి ఇనుప చువ్వను తొలగించి పారిపోయాడు. అతను పారిపోయిన కొద్ది సేపటికే మరో ముగ్గురు పారిపోయారు. ప్రస్తుతం బ్యారక్‌లో మొత్తం ఆరుగురు బాలనేరస్తులు శిక్ష అనుభవిస్తూన్నారు.

వీరిలో ఒకరు పేపీ కోసం ఆదిలాబాద్‌కు వెళ్లగా, మరొక బాలుడు మాత్రం నలుగురు పారిపోయిన వారితో వెళ్లకుండా బ్యారక్‌లోనే ఉండిపోయాడు. పారిపోయే నలుగురిని వారించినా వినలేదని తెలిసింది. బాలుడి కోసం బయటకు వెళ్లి తిరిగి వచ్చిన సూపర్‌వైజర్లకు బ్యారక్‌లో నుంచి మరో ముగ్గురు పారిపోయారని తెలియటంతో నివ్వెరపోయారు. వెంటనే బాలుర పరిశీలక గృహం సూపరింటెండెంట్ ఆనంద్‌కు విషయం తెలుపటంతో ఆయన వెంటనే అక్కడకు చేరుకున్నారు. పారిపోయిన వారికోసం గాలింపు చర్యలు చేపట్టారు. విషయం బయటకు పొక్కక ముందే బాలురను పట్టుకునేందుకు తీవ్రంగా గాలింపు చర్యలు చేపట్టారు.

చివరకు దొరకక పోవడంతో  శుక్రవారం పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేశా రు. ఈ ఘటనపై సూపరింటెండెంట్ ఆనంద్‌ను ‘సాక్షి’ సంప్రదింరగా శిక్ష అనుభవిస్తున్న నలుగురు బాల నేరస్తులు పారిపోయిన మాటా వాస్తవేమేనని అన్నారు. బాలురు పారిపోయిన రోజే తాము పోలీసులకు ఫిర్యాదు చేసినట్లు చెప్పారు. పోలీసులు మాత్రం బాల నేరస్తులు తప్పించుకు పోయారంటూ తమకు శుక్రవారమే ఫిర్యాదు వచ్చిందన్నారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై సైదయ్య తెలిపారు.

ఇదిలా ఉండగా బాల నేరస్తుల పారిపోయిన ఘటనలో విధుల పట్ల నిర్లక్ష్యం వహించారని హెడ్ సూపర్‌వైజరు ప్రభాకర్, సూపర్‌వైజర్ నాగావేందర్‌లను వెంటనే సస్పెండ్ చేసినట్లు బాలుర పరిశీలక గృహం సూపరింటెడ్ ఆనం ద్ తెలిపారు. పారిపోయిన బాలనేరస్తుల కోసం గాలిం పు చర్యలు చేపట్టామన్నారు.

మరిన్ని వార్తలు