రాజ్‌భవన్‌లో ప్రజా దర్బార్‌ నిర్వహించిన నరసింహన్‌

1 Jan, 2019 18:54 IST|Sakshi

సాక్షి, హైదరాబాద్‌: నూతన సంవత్సరం సందర్భంగా సాధారణ ప్రజలకు అందుబాటులో ఉండాలనే ఉద్దేశంతో గవర్నర్‌ నరసింహన్‌ రాజ్‌భవన్‌లో ప్రజాదర్బార్‌ నిర్వహించారు. ఈ కార్యక్రమానికి పలువురు ప్రముఖలతో పాటు, పెద్ద ఎత్తున సామాన్య ప్రజలు హాజరయ్యారు. ఈ సందర్భంగా తెలంగాణ హోం మంత్రి మహమూద్‌ అలీ, స్పెషల్‌ చీఫ్‌ సెక్రటరీ అజయ్‌ మిశ్రా, అసెంబ్లీ కార్యదర్శి నర్సింహులు, హైదరాబాద్‌ సీపీ అంజన్‌ కుమార్‌, ఏసీబీ డీజీ పూర్ణచందర్‌రావులతో పాటు పలువురు ప్రముఖులు గవర్నర్‌ను కలిసి నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపారు.

పలు పాఠశాలలకు చెందిన విద్యార్థులు గవర్నర్‌తో ఫొటోలు దిగారు.  సామాన్యులు, యువతి యువకులు పెద్ద ఎత్తున తరలివచ్చి గవర్నర్‌ దంపతులకు న్యూ ఇయర్‌ విషెస్‌ తెలిపారు. ఈ సందర్భంగా గవర్నర్‌ మాట్లాడుతూ.. రెండు తెలుగు రాష్ట్రాల ప్రజలకు నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేశారు. ఇది అందరి రాష్ట్రం అని.. రాష్ట్రాభివృద్ధి కోసం ప్రతి ఒక్కరు కృషి చేయాలని పిలుపునిచ్చారు. రెండు తెలుగు రాష్ట్రాల మధ్య ఉద్యోగుల విభజన మిగిలే ఉందని.. దానిపై వర్కవుట్‌ చేస్తున్నట్టు తెలిపారు. ఈ సందర్భంగా అందరికి మంచి జరగాలని అకాంక్షించారు.

మరిన్ని వార్తలు