మున్సిపల్‌ ఎన్నికల కంట్రోల్‌ రూం ఏర్పాటు

13 Jan, 2020 02:25 IST|Sakshi

ఎస్‌ఈసీ కార్యదర్శి అశోక్‌కుమార్‌ వెల్లడి

సాక్షి, హైదరాబాద్‌: రాష్ట్రంలోని మున్సిపల్‌ ఎన్నికల నేపథ్యంలో రాష్ట్ర ఎన్నికల కమిషన్‌ (ఎస్‌ఈసీ) హెల్ప్‌లైన్‌ కమ్‌ కంట్రోల్‌ రూంను ఏర్పా టు చేసింది. ఇందుకోసం మూడు ల్యాండ్‌ లైన్‌ ఫోన్‌ నంబర్లను కేటాయించింది. ప్రజలు, రాజకీయ పార్టీలు, పోటీ చేసే అభ్యర్థులు తమకున్న ఫి ర్యాదులను 040–29802895, 040–29802897 నంబర్లకు ఫోన్‌ చేసి చెప్పవచ్చని, 040–29801522 నంబరుకు ఫ్యాక్స్‌ ద్వారా తెలియజేయవచ్చని పేర్కొంది. దీని బాధ్యతలను తేదీల వారీగా చూసుకోవాల్సిన సిబ్బందిని నియమిస్తూ రాష్ట్ర ఎన్నికల సంఘం కార్యదర్శి ఎం.అశోక్‌కుమార్‌ ఆదివారం ఉత్తర్వులు జారీ చేశారు. రాజకీ య పార్టీలు, ప్రజలు, పోటీ చేసే అభ్యర్థుల నుం చి వచ్చే ఫోన్‌ కాల్స్, ఫ్యాక్స్‌ అన్నింటిని రిసీవ్‌ చేసుకోవడం, వాటిని రిజిస్టర్‌లో రికార్డు చేయడం వంటి పనులను విధుల్లో ఉన్న సిబ్బంది చేపట్టాలని, ఫోన్‌ చేసిన వారితో గౌరవంగా మాట్లాడాలని అందులో పేర్కొన్నారు. వచ్చిన ఫిర్యాదులను సంబంధిత మున్సిపల్‌ కమిషనర్‌/రిటర్నిం గ్‌ ఆఫీసర్‌/జిల్లా కలెక్టర్‌/పోలీసు అధికారులకు తెలియజేయాలని ఉత్తర్వుల్లో స్పష్టం చేశారు.

మరిన్ని వార్తలు