'ఆ రెండు లక్షణాలు కనిపిస్తే పరీక్షలు చేయాల్సిందే'

14 May, 2020 13:15 IST|Sakshi

సాక్షి, హైదరాబాద్‌ : రాష్ట్ర  వైద్య ఆరోగ్య శాఖ మంత్రి ఈటెల రాజేందర్‌ తెలంగాణలోని వైద్య సిబ్బందితో గురువారం వీడియో కాన్ఫరెన్స్‌ నిర్వహించారు. ఈ మేరకు వీడియో కాన్ఫరెన్స్‌లో జిల్లా వైద్యాధికారులు, ఆసుపత్రుల సుపరింటెండెంట్‌లు, ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల మెడికల్‌  అధి​కారులు, ఏఎన్‌ఎం, ఆశా వర్కర్లు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఈటెల మాట్లాడుతూ.. కరోనా నేపథ్యంలో ప్రతీ గ్రామంలో ప్రతి ఇంటికి తిరిగి ఇన్‌ప్లూయెంజా లక్షణాలు(జలుబు, దగ్గు, జ్వరం, గొంతునొప్పి), ఊపిరితిత్తుల న్యుమెనియా వంటి రెండు లక్షణాలు ఎవరికైనా కనిపిస్తే తప్పనిసరిగా పరీక్షలు నిర్వహించాలని మంత్రి వైద్య సిబ్బందిని కోరారు. అనంతరం కరోనాకు సంబంధించి గ్రామాల్లో, పట్టణాల్లో తీసుకుంటున్న చర్యలపై సమీక్షించారు. ఈ సందర్భంగా  ఈటెల రాజేందర్‌ పలువురు ఆశా వర్కర్లు, ఏఎన్‌ఎం వర్కర్లతో మాట్లాడారు.

ఈ కార్యక్రమంలో ఆరోగ్య శాఖ స్పెషల్ చీఫ్ సెక్రటరీ శాంతి కుమారి, కుటుంబ సంక్షేమ శాఖ కమిషనర్ డాక్టర్ యోగీతా రాణా, డైరెక్టర్ ఆఫ్ మెడికల్ ఎడ్యుకేషన్ డాక్టర్ రమేష్ రెడ్డి, డైరెక్టర్ ఆఫ్ పబ్లిక్ హెల్త్ డాక్టర్ శ్రీనివాసరావు, టిఎస్‌ఐఎండిసి ఎండీ చంద్రశేఖర్ రెడ్డి, కాళోజీ యూనివర్సిటీ వైస్ చాన్సలర్ డాక్టర్ కరుణాకర్ రెడీ, ఎక్స్పర్ట్స్ కమిటీ సభ్యులు డాక్టర్ గంగాధర్ పాల్గొన్నారు.
(మరో ఆరుగురికి పాజిటివ్‌)

మరిన్ని వార్తలు